జులై 24. ఇది మెగా అభిమానుల‌కి పండుగులాంటి రోజు. మెగా ఫ్యామిలి నుండి ఆ రోజు ఏ మూవీ రిలీజ్ అయినా అది బ్లాక్‌బ‌స్టర్ ఖాయం. రామ్‌చ‌ర‌ణ్ లేటెస్ట్ మూవీ ఎవ‌డు రిలీజ్ డేట్ క‌న్‌ఫ‌ర్మ్ కావ‌డంతో జులై 24 ప‌వ‌ర్ ఏంటో బ‌య‌టకు వ‌చ్చింది.

2002లో మెగాస్టార్ న‌టించిన ఇంద్ర మూవీ రిలీజ్ డేట్ జులై 24. టాలీవుడ్ బాక్సాపీస్‌ను షేక్ చేసిన మూవీగా ఇంద్ర పేరుతెచ్చుకుంది. అలాగే 1998లో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన తొలిప్రేమ మూవీ రిలీజ్ డేట్ 24. ప‌వ‌న్ కెరీర్‌లోనే చెప్పుకోద‌గ్గ మూవీగా తొలిప్రేమ నిలిచింది. ఈ మూవీతోనే ప‌వ‌న్ స్టామిమా ప‌వ‌ర్‌స్టార్‌గా మారింది. ఇప్పుడు 2013లో జులై 24 డేట్‌న రిలీజ్ అవుతున్న మూవీ రామ్‌చ‌ర‌ణ్ ఎవ‌డు. మూవీ ఎలాగున్నా స‌రే, రిలీజ్ డేట్ ఎంతో ప‌వ‌ర్‌పుల్ కాబ‌ట్టి ఎవ‌డు మూవీ సూప‌ర్‌డూప‌ర్ హిట్ అని అభిమానులు ఫిక్సై పోయారు.

ఇదిలా ఉంటే రామ్‌చ‌ర‌ణ్‌పై వ్యక్తిగ‌త లైఫ్‌పై నెగిటివ్ టాక్స్ వినిపిస్తున్న ఈ త‌రుణంలో ఎటువంటి ఎక్స్‌పెక్టేష‌న్స్ లేకుండా ఎవ‌డు మూవీ రిలీజ్ అవుతుంది. అందుకే ఏదోఒక ప్రమోష‌న్ మ్యాజిక్ ఉండాలని ఈ న్యూమ‌రాల‌జీని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చార‌ని ఇండ‌స్ట్రీలో ఈ రిలీజ్ డేట్ ర‌చ్ఛ జ‌రుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: