కొత్తదనానికి టాలీవుడ్ లో ఎప్పుడూ పెద్ద పీట వేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ ల పరిచయం విషయంలో మన దర్శకనిర్మాతలు పోటీ పడుతూ అందమైన ముఖాలను పరిచయం చేయడానికి అనుక్షణం వేటాడుతూనే ఉంటారు. అయితే కొత్తగా పరిచయం అయిన ప్రతి హీరోయిన్ యువతరాన్ని ఆకర్షిస్తుంది అని చెప్పడానికి కుదరదు. కాని సమంతా, నిత్యామినన్ లా తమ మొట్టమొదటి సినిమాలతోనే యువతరం హృదయాలను దోచుకున్న హీరోయిన్ లను మన ప్రేక్షకులు కూడా, తమిళతంబిలలా గుడులు కట్టకపోయినా మనవాళ్ళు కూడా విపరీతంగా ఆరాదిస్తూనే ఉంటారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక సినిమా రిలీజ్ కాకుండానే ఒక హీరోయిన్ కీ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆమె పేరు అనిషా. “అలియాస్ జానకి” అనే సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, టీజర్ లో ఆమె చాలా అందంగా కనిపించడంతో ఈమెకు కూడా టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. “పంజా” సినిమా తీసిన నిర్మాత నీలిమా తిరుమల శెట్టి రూపొందిస్తున్న ఈ చిన్న సినిమాలో అనిషా  లుక్స్ చాల క్యూట్ గా ఉన్నాయని, ఆమెను సినిమా సెట్స్ లో చూసిన వారు అంటున్నారు.

ప్రస్తుతం చిన్న సినిమాల హవా నడుస్తోంది కాబట్టి అనిషా కు కూడా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడితే ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమను పీడిస్తున్న హీరోయిన్ ల కొరత సమస్యకు పరిష్కర౦ దొరుకుతుందని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈమె క్యూట్ లుక్స్ చూడాలి అంటే ప్రేక్షకులు ఈ సినిమా విడుదల అయ్యే దాక ఆగాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: