ఆమెతో డేటింగ్ అంటే చ‌కాచ‌కా అయిపోవ‌ల్సిందే, వ‌చ్చామా, డేటింగ్ చేశామా, వెళ్ళామా, అంతే. అంత‌కుమించి ఆ బ్యూటీతో ఇంకో టాపిక్ అన‌వ‌స‌రం అంటోంది ఆమె. త‌నే దీపికా. దీపికా ప‌దుకొనే లేటెస్ట్‌గా ఓ రెస్టారెంట్లో డేటింగ్ చేస్తూ అంద‌రిలో ప‌ట్టుబ‌డిపోయింది.

ఓ ప‌క్క ర‌ణ్‌భీర్ క‌పూర్‌,షారుఖ్‌ఖాన్‌, ఇప్పుడు ర‌ణ్‌వీర్ సింగ్‌. త‌న‌న అప్ క‌మింగ్ ఫిల్మ్ రామ్‌లీలా లో దీపికా ప‌దుకొనేకి ర‌ణ్‌వీర్ సింగ్‌ కోస్టార్‌. వీళ్ళిద్దరూ బాంద్రా రెస్టారెంట్ సీక్రెట్‌గా క‌లిసి డిన్నర్ అండ్ డేటింగ్ ను ప్లాన్ చేసుకున్నారు. ఈ విష‌యం ఎవ‌రికి తెలియ‌కుండా జ‌రిగిపోయింది.

మీడియాకు ఈ మేట‌ర్‌ ఎలా తెలిసిందో, సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని బాంద్రాలో ఆ రెస్టారెంట్ బ‌య‌ట, ఈ ఇద్దరి కోసం వెయిట్ చేశారు. రెస్టారెంట్ సెక్యూరిటిలు మీడియా వ‌చ్చిన‌ విష‌యాన్ని దీపికాకు చేర‌వేశారు. దీంతో డేటింగ్ ప్లానింగ్‌ను కాన్సిల్ చేసుకొని, మీడియా కంట ప‌డ‌కుండా ఇద్దరూ చెరో గేటు ద్వారా బ‌య‌ట‌కు వెళ్ళిపోయారు. దీపికాతో డేటింగ్ అంటే ఇప్పుడు చిన్న విష‌య‌మే అయినా, దాన్ని బ‌య‌ట‌కు రాకుండా మేనేజ్ చేయాలంటేనే ఓ పెద్ద స‌మ‌స్యగా క‌నిపిస్తుందని బి-టౌన్‌లో హాట్ టాపిక్‌

మరింత సమాచారం తెలుసుకోండి: