ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలు చొక్కా విప్పే కార్యక్రమాలకు క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్, రానా, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా వరసగా చొక్కాలు విప్పే కార్యక్రమాలు చేపడుతూ ఉంటే తాను కూడా ఈ రేస్ లో ఉన్నాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన సిక్స్ ప్యాక్ అవతారానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. జూనియర్ సిక్స్ ప్యాక్ అవతరాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో రుపొందితున్న “రామయ్యా వస్తావయ్యా” లో యంగ్ టైగర్ అభిమానులకు కనబడనుంది.

ఈ సిక్స్ ప్యాక్ కోసం ఎన్టీఆర్ ఫిట్ నెస్ ట్రైనర్ జాన్ షుమాట్ అనే అంతర్జాతీయ ట్రైనర్ వద్ద శిక్షణ కూడా తిసుకుంటున్నాడట. బాద్ షా సినిమాలో నటించిన అజీజ్ ఖాన్ జూనియర్ కు ఈ ట్రైనర్ ను పరిచయం చేశాడు అట. ప్రస్తుతం ఈ ట్రైనర్ ఆధ్వర్యంలో జూనియర్ కొన్ని వర్క్ అవుట్స్ కూడా చేస్తునట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కర్ణాటకా లో ఎన్టీఅర్ తో ఈ సిక్స్ ప్యాక్ అవతారంతో కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు హరీష్ శంకర్ చిత్రికరిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు ఈ సినిమా విజయం పై పూర్తి నమ్మకంపై ఉండడమే కాకుండా “బృందావనం” లో ఎన్టీఅర్ ను ఎలా డిఫరెంట్ స్టైల్ లో చుపెట్టామో ఈ సినిమాలో కూడా ఎన్టీఅర్ ఎవరూ ఉహించని డిఫరెంట్ స్టైల్ లో కనపడతాడు అని చెప్పడంతో ఈ సినిమాలో ఎన్టీఅర్ సిక్స్ ప్యాక్ అవతారం ఉంటుందన్న వార్తలు నిర్ధారణ అయిపోయినట్లే అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. శ్రుతి హాసన్ హాట్ లుక్స్ తో పాటు ఎన్టీఅర్ సిక్స్ ప్యాక్ అవతారం కూడా ఈ సినిమాకు తోడైతే ఎన్టీఅర్ కోరుకొనే బ్లాక్ బస్టర్ మూవీ గా “రామయ్యా వస్తావయ్యా” మిగిలిపోతుంది అని అనుకోవడంలో సందేహం లేదు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: