ద‌గ్గుబాటి రానా కండ‌ల‌ను చూసి మెగా హీరోయిన్ మోజు ప‌డింది. త‌న ట్విట్టర్లో తెగ ట్వీట్లు చేస్తూ రానాను ఎక్కడికో ఎత్తేస్తుంది. రీసెంట్‌గా రామానాయుడు బ‌ర్త్‌డేను అడ్డంపెట్టుకొని రానాతో మాటలు క‌లిపింది ఆ హాటీ హీరోయిన్‌. త‌ను ఎవ‌రో కాదు, ఇద్దర‌మ్మాయిల‌తో అల్లుఅర్జున్ స‌ర‌స‌న, హాట్ ఎక్స్‌ఫోజ్ చేసిన కేథ‌రిన్ థెరిస్సానే.

కేథ‌రిన్ థెరిస్సాకు హీరోల‌ను ఎలా మ‌త్తులోకి దింపి, ఆఫ‌ర్లను కొల్లగొట్టాలో ఇట్టే క‌నిపెట్టేసింది. హైబ్రిడ్ బ్యూటీలాగా క‌నిపించే కేథ‌రిన్‌, రానా ఫిజిక్‌కు ఇట్టే ప‌డిపోయిందట‌. ప్రస్తుతానికి కేథ‌రిన్ హాట్ బ్యూటీ అయినా, ఈమెను ఎవ‌రు ఉప‌యోగించుకోవాలో తెలియ‌టం లేదు. ఎందుకంటే క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నింటిలోనూ ప్రి అడ్వాన్డ్స్‌గా హీరోయిన్స్‌ బుక్ అయ్యారు.

అందుకే ఎప్పుడు ఏ హీరో ప‌క్కన‌ ఖాళీ దొరికితే, అప్పుడు హీరోయిన్ ఛాన్స్ కోట్టేద్దామ‌ని, త‌న‌కు అందుబాటులో ఉన్న తెలుగు హీరోలంద‌రిని లైన్లో పెట్టే ప‌నిలో ప‌డింది. సో ప్రస్తుతానికి రానాతో క్లోజ్‌గా మూవ్ అవుతుంది కేథ‌రిన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: