మెగా కుటుంబంలో ముగ్గురు హీరోలు ఉన్నా పక్కా ప్లానింగ్ లో ఉంటారు. ఒకరిసినిమా తో ఒకరు పోటీ పడకుండా టైం గ్యాప్ తీసుకుంటూ శక్తి మేరకు టాలీవుడ్ కలెక్షన్స్ ను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గత సంవత్సరం కూడా సమ్మర్ లో మెగా కుటుంబ హీరోల సినిమాలు రచ్చ, గబ్బర్ సింగ్, జులాయి సినిమాలు విడుదల అయినా సినిమా సినిమాకు నెల రోజుల గ్యాప్ ఉంచుకుంటూ సమ్మర్ కలెక్షన్స్ ను ప్లాన్డ్ గా కొల్లగొట్టారు. కాని ఈసారి ఆ సీన్ రివర్స్ అవుతోంది. కేవలం రెండు వారాల గ్యాప్ తో అబ్బాయి సినిమా పైకి బాబాయి వస్తున్నాడు. మొదటగా జూలై 25 న రామ్ చరణ్ “ఎవడు” తెలుగు తెరపైకి రాబోతుంటే, కేవలం 15 రోజుల గ్యాప్ తో ఆగష్టు 7 న పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది” అంటూ వచ్చేస్తున్నాడు.

ఇలా 15 రోజుల గ్యాప్ తో ఒకే కుటుంబానికి చెందిన రెండు సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులపై దాడి చేయడం ఇది వరకు ఎప్పుడూ జరగలేదు. ఇదే జరిగితే ఈ రెండు పెద్ద సినిమాలపై  కలెక్షన్స్  ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని, ఇది అటు పవన్ కు కాని ఇటు రామ్ చరణ్ కు కాని శ్రేయష్కరం కాదని అంటున్నారు. ముఖ్యంగా సినిమా ఓపెనింగ్స్ విషయంలో చెర్రీ సినిమాల కన్నా పవన్ కళ్యాణ్ సినిమాల ఓపెనింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఎన్ఆర్ఐ ప్రేక్షకులు కూడా చెర్రీ సినిమాల కన్నా పవన్ సినిమాల పట్ల మోజు ఎక్కువ. అదీ కాకుండా దర్శకుడు వంశీ పైడిపల్లి పట్ల కన్నా ప్రేక్షకులకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు అంటే మోజు. వీటన్నింటి ప్రభావం ఈ రెండు సినిమాల పై పడి అటు చెర్రీ కి ఇటు పవన్ కూ పూర్తి ఫలితం రాకుండా పోతుంది అని విశ్లేషకులు అంటున్నారు.

 ఇప్పటికే ఈ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు అధికారికంగా తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించడంతో వచ్చే జూలై, ఆగష్టు మాసాలలో బాబాయి వెర్సస్ అబ్బాయి పోటీ తప్పదేమో అనే సూచనలు కనిపిస్తున్నాయి. ఏమైనా ఆఖరు క్షణాలలో మార్పులు జరిగితే తప్ప అబ్బాయి స్పీడ్ కు బాబాయి బ్రేక్ వేసే సూచనలు పుష్కలంగా కనిపించడమే కాకుండా మెగా వార్ కు తెర లేచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు. అదీ కాక ఈ మధ్య చిరంజీవి – పవన్ ల మధ్య సన్నిహిత సంబంధాలు కొద్దిగా తగ్గడంతో పవన్ మాత్రం తన సినిమాను ఎట్టి పరిస్థితులలోనూ ఆగష్టు 7 కే విడుదల చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడట. మరి అబ్బాయి, బాబాయి తో సర్దుకుపోతాడా...? లేకుంటే అబ్బాయి వెర్సెస్ బాబాయి పోటీ కి తెర తిస్తాడా..? అనే విషయం తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: