తండ్రి సాధించిన బ్లాక్‌బ‌స్టర్ హిట్స్‌ను త‌న‌యుడు రిమేక్ చేసి ఆక‌ట్టుకోవాల‌నుకుంటున్నాడు. ఎట్ ప్రెజెంట్ నాగాచైత‌న్యకు హిట్ కంప‌ల్సరి అయింది. కింగ్ నాగార్జున కెరియ‌ర్లో చెప్పుకోద‌గ్గ హిట్ ఫిల్మ్స్‌లో హ‌లోబ్రద‌ర్ కూడ ఒక‌టి. 1994లో ఈ ఫిల్మ్ ఓ ఊపు ఊపింది.ఆ సంవ‌త్సరానికి బ్లాక్‌బ‌స్టర్‌గా నిలిచి, అక్కినేని అభిమానుల‌కి ఆనందాన్ని ఇచ్చింది.

నాగచైత‌న్య రిమేక్ చేస్తున్న ఈ మూవీ జులై నుండి కంటిన్యూగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్స్‌ను ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో, తండ్రి సినిమాను డైరెక్ట్‌గా రిమేక్ చేస్తున్న త‌న‌యుడుగా నాగ‌చైత‌న్య మొద‌టి వ‌రుస‌లో ఉన్నాడు. నాగార్జున‌తో ఢ‌మ‌రుకం తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ శ్రీ‌నివాస రెడ్డి, హ‌లోబ్రద‌ర్ రిమేక్ ఫిల్మ్‌ను తెర‌కెక్కిస్తున్నాడు.

ఢ‌మ‌రుకం స‌మ‌యంలోనే కొడుకుతో ఒక సినిమా చేయ‌డానికి డైరెక్టర్ శ్రీ‌నివాస రెడ్డికి అప్పుడే నాగార్జున మాట ఇచ్చాడు. త‌ఢాఖా చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ కాక‌పోయినా, ఈ హ‌లోబ్రద‌ర్ మూవీపై పూర్తి న‌మ్మకాన్ని పెట్టుకున్నా నాగ‌చైత‌న్య.

మరింత సమాచారం తెలుసుకోండి: