గత రెండు రోజులుగా అల్లుఅర్జున్ పై వస్తున్న అనేక రూమర్స్ కు బన్నీ క్లారిటీ ఇచ్చాడు. తను, తన భార్య స్నేహ మధ్య ఎటువంటి సమస్యలు లేవని స్పష్టం చేసారు. తను తన భార్య విడాకులు తీసుకుంటున్నామని షాకింగ్ రూమర్ ఎలా ప్రచారంలోకి వచ్చిందో అర్ధం కావడం లేదని ‘మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిన రోజునుంచి మా మధ్య ప్రేమ మొదలైంది నేను స్నేహ ఎటువంటి ఘర్షణలు లేకుండా మా వైవాహిక జీవితంలో చాలా సంతోషంగ ఉన్నాం’ అని అన్నాడు.

తను సినిమా రంగంలో ఉన్నాను కాబట్టి తనకు రూమర్స్ అలవాటేనని కానీ తన భార్యా ఆమె కుటుంబ సభ్యులు ఇలాంటి వార్తలను జీర్ణించుకోవడానికి సమయం పడుతుందని, దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచార్లు చేయవద్దు అంటూ కోరాడు. మరి కొన్ని సంవత్సరాలు తరువాత తాము పిల్లలను కనే ఆలోచనలో ఉన్నామని చెప్పుకొచ్చారు .

సేలిబ్రెటీల జీవితాలు అందమైన అడ్డాల భవంతి లా ఉంటాయి, వాటిపై చిన్న రాయి పడిన పగుళ్ళు ఏర్పడి అందవిహీనంగా కనపడుతాయి. కాబట్టి రూమర్స్ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాయి. ఈ వాస్తవాలను గ్రహించి మన తారలు కూడా వారి వ్యక్తిగత జీవితాలను ఎదుటి వారు వేలెత్తి చూపించే విధంగా ఉంటే ఇటువంటి రూమర్లు రావు.ఈ వాస్తవాలు మన సేలిబ్రేటీలు గ్రహిస్తే బాగుంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: