ఎందుకో తెలీదు గానీ... మెగా ఫ్యామిలీకి కాలం క‌ల‌సి రావ‌డం లేదు. అంద‌రూ ఏదో ఓ విధంగా వార్త‌ల్లో ఉంటున్నారు. గుడ్ న్యూస్ అయితే ఓకే. కానీ.. గాలి క‌బుర్లు, వివాదాలు, విమ‌ర్శ‌లు. రామ్‌చ‌ర‌ణ్ న‌డి రోడ్డుమీద ర‌చ్చ చేశాడు. ఆ త‌ర‌వాత అల్లు శిరీష్‌, వెంక‌ట్ బార్‌లో తంద‌నాలు ఆడి... మీడియాకి ఎక్కారు. ఇప్పుడు బ‌న్నీపై రూమ‌ర్స్ వ‌స్తున్నాయి.

స్నేహారెడ్డికి విడాకులు ఇవ్వ‌డానికి బ‌న్నీ ప్లాన్ చేసుకొంటున్నాడ‌ని, ఇద్ద‌రూ ఇప్పుడు వేర్వేరుగా ఉంటున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.వీటిపై బ‌న్నీ ఓ క్లారిటీ ఇచ్చాడు. స్నేహ‌ని ఎప్పుడైతే చూశానో, అప్పుడే ప్రేమ‌లో ప‌డిపోయాన‌ని, ఆ ప్రేమ ఇప్ప‌టికీ త‌మ మ‌ధ్య ఉందని చెబుతున్నాడు. ఇలాంటి గాసిప్పులు రాసే మీడియా మిత్రులు కాస్త ఆలోచించి రాయండి..

అంటూ హిత‌బోధ చేస్తున్నాడు. తొంద‌ర్లోనే బిడ్డ‌ను కూడా కంటాడ‌ట‌.మరి ఈ వార్త‌లెలా బ‌య‌ట‌కు వ‌చ్చాయి అంటే ఎవ‌రేం చెబుతారు?  నిప్పులేనిదే పొగ‌రాద‌నేది సిద్ధాంతం. దాని ప్ర‌కారం ఆలోచిస్తే... ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో జ‌రిగే ఉంటుంది. కాపురం అన్నాక‌... స‌వాల‌క్ష ఉంటాయి. మామూలే. కానీ సెల‌బ్రెటీలు క‌దా. వీళ్ల జీవితాలు ఇంతే మరి!

మరింత సమాచారం తెలుసుకోండి: