ఒక‌వైపు బాహుబ‌లి కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు ప్ర‌భాస్‌. ఈ సినిమా ఇంకా మొద‌ల‌వ్వ‌లేదు. రెండేళ్ల పాటు...ఈ సినిమా కోసం కాల్షీట్ల‌న్నీ ఇచ్చేశాడు. ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు మ‌రో సినిమాకి ప‌నిచేసే అవ‌కాశం కూడా లేదు. అయితే కృష్ణం రాజు మాత్రం ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి క‌ల్ల‌బొల్లి మాట‌లు చెబుతున్నాడు. నా డైరెక్ష‌న్‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు.. ఆ సినిమా ఆగ‌స్టులో మొద‌ల‌వుతుంది..

అని ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు.కృష్ణంరాజు ద‌ర్శ‌క‌త్వంలో త్వ‌ర‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ కూడా ఉన్నాడు. అయితే ఆ సినిమా  ఎప్పుడు?  అనేదానిపై క్లారిటీ లేదు. కానీ కృష్ణంరాజు మాత్రం ఆగ‌స్టులో సినిమా మొద‌లుపెడ‌తా అని చెప్ప‌డం విడ్డూరంగా ఉంది. ఇటీవ‌ల కృష్ణంరాజు విజ‌య వాడ వెళ్లారు. అక్క‌డ ప్ర‌భాస్ అభిమానులు సినిమా ఎప్పుడు?

 అని అడిగారు. క‌థ సిద్ధంగాఉంది. ఆగ‌స్టులో మొద‌లెట్టేస్తా. ఇదో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ అదిరిపోతుంది.. అంటూ ఊరిస్తున్నాడు. బాహుబ‌లి పూర్తయ్యే వ‌రకూ మ‌రో సినిమా ఒప్పుకోలేని స్థితిలో ఉన్న ప్ర‌భాస్‌... పెదనాన్న‌కి కాల్సీట్లు ఇస్తాడా?  అనేది సందేహ‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: