దాస‌రికి బొగ్గు మ‌సి అంటింది. బొబ్బిలి పులి కాస్త‌.. బొగ్గుల పులి అయ్యాడు. సీబీఐ రేపో మాపో... దాస‌రికి అరెస్టు చేయ‌డం ఖాయ‌మ‌నే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. అయితే దీని వెనుక‌.. చిరంజీవి హ‌స్తం ఉంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దాస‌రి - చిరు మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లున్నాయి. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌దు. చిరు.. కేంద్ర‌మంత్రి అయ్యాక - కాంగ్రెస్ పార్టీలో ఆయన బ‌లం పెరిగింది. అదే స‌మ‌యంలో దాస‌రి ప‌ట్ల‌.. చిన్న‌చూపు మొద‌లైంది.

చాలా సంద‌ర్భాల్లో దాస‌రి చిరుపై ప్ర‌త్య‌క్ష్యంగా, ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు, చ‌ర‌ణ్‌ని కూడా వ‌ద‌ల్లేదు. దాంతో ఆ కోపం అంతా చిరు ఇలా తీర్చుకొన్నాడ‌ని, ఈ సీబీఐ దాడుల వెనుక చిరు హ‌స్తం ఉంద‌ని చెప్పుకొంటున్నారు.అయితే ఈ వార్త‌ల్లో.. నిజాల గురించి కాస్త లోతైన విశ్లేష‌ణ చేస్తే చిరుకి అంత సీన్ లేద‌నే విష‌యం అర్థం అవుతుంది. ఎందుకంటే బొగ్గు స్కామ్ ఇప్ప‌టిది కాదు. గ‌త రెండేళ్ల నుంచీ సీబీఐ.. విస్రృతంగా ఈ కేసుని ప‌రిశోధిస్తోంది. దాస‌రికి వ్య‌తిరేకంగా సీబీఐ ద‌గ్గ‌ర బ‌ల‌మైన ఆధారాలున్నాయ‌ట అందుకే...

దాస‌రి ఇంట్లో సోదాలు చేశారు. దాస‌రికి అరెస్టు చేయ‌డ‌మే త‌రువాయి. కేంద్రంలో చిరుకి ప‌లుకు బ‌డి ఉంద‌న్న‌మాట నిజ‌మే కానీ, ఒక వ్య‌క్తిపై సీబీఐని రంగంలోకి దింపేంత కాదు.. అనే విష‌యం రాజ‌కీయ ప‌రిజ్ఞానం తెలిసిన ఎవ్వ‌రికైనా తెలిసిపోతుంది. పైగా ఇప్పుడంతా అక్క‌డ ఎన్నిక‌ల హ‌డావుడి. ఈ స‌మ‌యంలో దాస‌రిని టార్గెట్ చేసి... త‌న విలువైన కాలాన్ని వృథా చేయ‌డానికి చిరుకి కూడా ఇష్టం ఉండ‌దు. సో... దాస‌రి బొగ్గు మ‌సి వెనుక చిరు హ‌స్తం లేన‌ట్టే... అనే విష‌యం అర్థం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: