క్రియేటివ్ దర్శకుడు రాజమౌళి సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన క్రేజ్. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి ఒక పెద్ద సేలిబ్రేటి ఇంత ఉన్నత స్థానంలో ఉన్నా చాలా సింపుల్ గా ఉండటం ఆయన జీవన శైలి. అంతేకాదు రాజమౌళి మనస్సులో ఏమి దాచుకోడు. తనకు నచ్చితే చాలు ఆ విషయాన్ని నలుగురుతో పంచుకోవాలని తన ట్విటర్ లో పెట్టేస్తాడు. రాజమౌళికి నచ్చితే చాలు మన తెలుగు ప్రేక్షకులకు అదొక ఐఎస్ఐ ముద్రలా మారిపోయింది. ప్రేక్షకులు నాడి తెలిసిన డాక్టర్ కాబట్టి రాజమౌళి అన్నీ ముందు గానే ఉహిస్తాడు.

 టాలీవుడ్ లోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి నటుడునీ ఎవరికి సమర్ధత ఉంటే వారిని పొగుడుతాడు. గతంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా చూసి పవన్ ని తెగపోగిడెసాడు. అదేవిధంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెటప్ ను ‘బాదుషా’ లో చూసి ఆకాశానికి ఎత్తేశాడు. హనూరాఘవ పూడి దర్శకత్వం వహించిన ‘అందాల రాక్షసి’ సినిమాను చూసి తాను ఆసినిమా కోసం నిర్మాతగా మారిపోయాడు. గత వారం విడుదలైన మారుతి నిర్మించిన ‘ప్రేమ కధా చిత్రం’ సినిమాను చూసి మనస్సు పరేసుకోవడమే కాకుండా ఆ సినిమాను పొగుడుతూ తన ట్విటర్ లో సందేశాలు పెట్టడంతో ఇప్పటికే యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా రాజమౌళి సర్టిఫికేట్ తో బెస్ట్ మూవీ గా మారిపోయి కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది .

ఎ సేలిబ్రేటి అయినా డబ్బు పుచ్చుకుని బ్రాండ్ అంబాసిడర్ గ మారుతారు, కానీ మన రాజమౌళి మాత్రం తనకు నచ్చితే చాలు ఎవరికైనా, ఎటువంటి సినిమాకైనా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తూ అందరి బందువుగా మారిపోయారు మన జక్కన్న...

మరింత సమాచారం తెలుసుకోండి: