నాగార్జునకు మాస్ హీరోగా పేరు తెచ్చిన చిత్రాలలో 'హలోబ్రదర్' మంచి ప్లేస్ లో ఉంటుంది. నాగార్జున డబుల్ రోల్స్ చేసిన ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ లోని సూపర్ హిట్టు పాటలు ఇప్పటికి మారుమ్రోగుతూనే ఉంటాయి. 
 

ఇలాంటి చిత్రం రీమేక్ గా, అదీ నాగ్ తనయుడు నాగ చైతన్య చేస్తున్నాడంటే అందరిలో ఆసక్తి ఏర్పడటం సహజం. నాగార్జునకి సొంత బ్యానర్ లాంటిదైన కామాక్షి మూవీస్ సంస్థ ఈ రీమేక్ చేయబోతుందని అఫీషియల్ గా తెలియజేశారు. అయితే ఈ ప్రాజెక్టుని ఎప్పుడో ప్రారంభించాల్సిన డి. శివప్రసాద్ రెడ్డి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 
 

తాజాగా నిర్మాత మళ్ళీ ఓ ప్రెస్ రిలీజ్ వదిలాడు. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఆ ప్రెస్ నోట్ సారాంశం. అయితే మూవీ ఓపెనింగ్ గురించే సరిగా తెలపకుండా  అప్పుడే రెగ్యులర్ షూటింగ్ అని నిర్మాతగారు మాట్లాడడంచాలా మందికి అనుమానం తెప్పిస్తుంది. ఇంకొన్ని క్లోజ్ సోర్స్ సమాచారం ద్వారా చూస్తే అసలు ఈ చిత్రం సెట్ ఎక్కే అవకాశాలే చాలా తక్కువని తెలిసింది. ఏదో తూతు మంత్రంగా  ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినంత మాత్రాన మూవీ స్టార్ట్ అయిపొద్దా, కావాలంటే ఇదే దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి డమరుకం మోతకు చెవుల్లో చిల్లుబడ్డ నాగార్జునని అడిగితే మిగతా వివరాలు చెబుతాడు!

మరింత సమాచారం తెలుసుకోండి: