గోపీచంద్, తాప్సీ హీరో హీరోయిన్లుగా చేసిన మొగుడు రిజల్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించు కోవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది అతిపెద్ద డిజాస్టర్. తాజాగా వీరిద్దరే మళ్లీ కలిసి చేస్తున్న సాహసం ఇంకా రిలీజ్ కాకపోయినా, రిజల్ట్ మాత్రం తాజాగా వచ్చిన ట్రైలర్ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది. 
 

మొగుడుకి ఏం మైనస్సో, అదే మైనస్సు ఈ మూవీకి కూడా కనబడుతోంది. 'మీలాంటి అనుభవం ఉన్న యాత్రికుడితో యాత్రకు వెళ్ళడం నా అదృష్టం' అంటూ హీరోయిన్ తాప్సీ చెప్పే డైలాగ్ వింటున్నా, చూస్తున్నా సాహసం మరో మొగుడు అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని తెలిసిపోతుంది. 
 

ఒకసారి తాప్సీతో దెబ్బడిపోయాక కూడా మళ్ళీ ఆమె చేతే అదే డబ్బింగ్ చెప్పించడం  నిర్మాతకి, దర్శకుడికి, హీరో కి ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో తెలియదు కానీ నిజంగా ట్రైలర్ చూసిన వారంతా చిత్రంపై అప్పుడే ఓ లెక్కకి వచ్చేసారన్నది మాత్రం నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: