నాగచైత‌న్య బండి జోరుమీద ఉంది. చాలా కాలం త‌ర‌వాత త‌డాఖా రూపంలో ఓ హిట్ వ‌చ్చింది క‌దా..?  ఇదే ఉత్సాహంతో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. అక్కినేని వార‌సుల సినిమా మనం షూటింగ్ లాంఛ‌నంగా మొద‌లైంది. ఇప్పుడు హ‌లో బ్ర‌ద‌ర్ కూడా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. శ్రీ‌నివాస‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. కామాక్షి క‌ళా మూవీస్ సంస్థ తెర‌కెక్కిస్తోంది.

డి. శివ ప్ర‌సాద్ రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. జులైలో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇటీవ‌లే లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించార‌ట‌.ఇది హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాకి రీమేక్ అని చెబుతున్నా - క‌థ‌ని మ‌క్కీకి మ‌క్కీ దించ‌డం లేద‌ట‌. కేవ‌లం ఆ లైన్ మాత్ర‌మే తీసుకొన్నార‌ట. సోలో హీరోగా త‌న‌ను తాను నిరూపించుకోవ‌డానికి చైతూకి ద‌క్కిన అవ‌కాశం ఇది.

త‌డాఖా హిట్ అయినా, అందులో సునీల్ కూడా వాటాకు వ‌చ్చాడు. ఇప్పుడు ఒక్క‌డే సినిమా అంతా భుజాన వేసుకొన్నాడు. త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మ‌రో భామ‌కూ ఛాన్స్ ఉంది. ఆ అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: