స్నేహా న‌యా ఇన్నింగ్స్ మొద‌లెట్టే ప‌నిలో ప‌డింది. క‌థానాయిక‌గా కాదు. నిర్మాత‌గా. సినిమా రంగంలో త‌న‌కున్న అనుభ‌వాన్నంతా రంగ‌రించి ఓ సినిమా తీయాల‌ని స్నేహా భావించింది. భ‌ర్త‌.. ప్ర‌స‌న్న కూడా అందుకు ఓకే చెప్పాడు. గ‌త ఆరునెల‌లుగా స్నేహా క‌థ‌లు వింటోంది. అయితే ఒక్కరూ స్నేహాను సంతృప్తిప‌ర‌చ‌డం లేద‌ట‌. రొటీన్ క‌థ‌లు చెప్పి విసిగిస్తున్నార‌ట‌. దాంతో సినిమా...

వ్య‌వ‌హారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.క‌థ‌లు చెప్ప‌డానికి వ‌స్తున్న వారికి స్నేహా ఓ ష‌ర‌తు విధిస్తోంద‌ట‌. మీ క‌థ‌లో నా పాత్ర‌కు ప్రాధాన్యం ఉండాలి.. అంటూ ముందే ముంద‌రి కాళ్ల‌కు బంధ‌మేస్తోంద‌ట‌. దాంతో క‌థ బాగున్నా - అందులో త‌న పాత్ర‌కు ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో అవ‌న్నీ బుట్ట‌దాఖ‌లు చేస్తోంద‌ట‌. దాంతో..

వ‌చ్చిన వాళ్లు వ‌చ్చిన‌ట్టే వెన‌క్కి వెళ్తున్నార‌ట‌. ఇంకొంత‌మంది స్నేహాకి క‌థ చెప్ప‌డం మా వ‌ల్ల కాదు బాబోయ్ అంటున్నారు. ప్ర‌తి విష‌యంలోనూ విప‌రీత‌మైన జోక్యం చేసుకోవ‌డంతో దర్శ‌కులు బెంబేలెత్తిపోతున్నార‌ట‌. చూస్తుంటే.. స్నేహా ద‌ర్శ‌క‌త్వం కూడా చేసేస్తుందేమో..?  ఇంత‌కీ స్నేహాకి క‌థ‌తో సంతృప్తి ప‌రిచే మొన‌గాడు ఎవ‌డో, ఎప్పుడు వ‌స్తాడో?

మరింత సమాచారం తెలుసుకోండి: