రూల‌ర్ ప‌క్క‌న మెరిసే ముద్దుగుమ్మ‌ల అన్వేష‌ణ ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టే. నంద‌మూరి బాల‌కృష్ణ‌-బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో వ‌స్తున్న సినిమాలో క‌థానాయిక‌గా  మిస్ ఇండియా ఎరికా ఫెర్నాండెజ్ ని తీసుకొన్న‌ట్టు స‌మాచారం.  2012 మిస్ ఇండియా ఫ్రెష్ పేస్ గా ఈ ముద్దుగుమ్మ ఎంపికైంది. అందాల కిరీటం చేజిక్కుంచుకుంది. కిరీటం ద‌క్కిన త‌ర‌వాత చాలామంది నిర్మాత‌లు ఎరికాని సంప్ర‌దించారు.

అయితే ఎవ‌రికీ ఒకే చెప్ప‌లేదు. చివ‌రికి బాల‌య్య తో న‌టించ‌డానికి సై అంది.ఓ క‌థానాయిక దొరికింది స‌రే, కానీ... ఎరికా - బాల‌య్య మ‌ధ్య వ‌య‌సు రీత్యా చాలా తేడా ఉంది. బాల‌కృష్ణ ప‌క్క‌న ఎరీనా మ‌రీ చిన్న‌పిల్ల‌లా క‌నిపిస్తుంద‌ని ఈ జోడీ అస్స‌లు బాగోద‌ని అప్పుడే అభిమానులు బెంగ పెట్టేసుకొన్నారు.

బాల‌య్య‌కు మిస్ ఇండియా కావాల‌ట‌.. అంటూ నాన్ నంద‌మూరి ఫ్యాన్స్ జోకులు వేసుకొంటున్నారు. సింహాలో స్నేహా ఉల్లాల్ న‌టించ‌లేదేంటి?  ఇదీ అంతే.రూల‌ర్ చిత్రంలో ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు చోటింది. ఎరికా రెండో నాయిక స్థానం సంపాదించింది. ఇక ప్ర‌ధాన నాయిక‌ను ఎంచుకోవాలి. అది ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: