నిత్య‌మీన‌న్ మంచి న‌టి. మినీ సౌందర్య‌గా పేరు తెచ్చుకొంది. నిర్మాత‌ల్ని సెట్లో ఏ మాత్రం ఇబ్బంది పెట్ట‌ద‌ట‌. రీటేకులు అస్స‌లు తీసుకోద‌ట‌. అంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ... సినిమా క‌థ చెప్ప‌డానికి వెళ్తే... దర్శ‌కుల‌కు ష‌ర‌తుల చిట్టా విప్పి తెగ విసిగించేస్తుంద‌ట‌. నిత్యా... ఇవేం ష‌ర‌తులు తల్లీ..?  అంటూ వెళ్లిన వాళ్లు గాబ‌రా ప‌డిపోతున్నారు.క‌థ‌లో నా పాత్ర‌కు ప్రాధాన్యం ఉండాలి..

అని అడ‌గ‌డంలో త‌ప్పులేదు. నిత్య మొద‌టి ష‌ర‌తు అదే. దానితో పాటు కొత్త కొత్త ష‌ర‌తులు చెబుతుంద‌ట‌. వాన పాట‌లు ఉండ‌కూడ‌దు అనేది అందులో ఒక‌టి. ముద్దులూ, కౌగిలింత‌లూ అస్స‌లు ఉండ‌కూడ‌ద‌ట‌. డ‌బుల్ మీనింగ్ డైలాగ్ చెప్ప‌ద‌ట‌. త‌నే కాద‌ట‌... ఈ సినిమాలో వేరే ఏ మ‌హిళ చేత ఇవి ప‌లికించ‌కూదట‌.  అంతే కాదు... రాత్రి షూటింగ్ అంటూ ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌ట‌. ఇలా బోలెడ‌న్ని ఉన్నాయ్ లెండి. 

నేను న‌టించే సినిమా క్లీన్ గా ఉండాలి అనుకోవ‌డంలో త‌ప్పేం ఉంది. నా ఇంట్లో నా గ‌ది మాత్ర‌మే కాదు. అన్ని గ‌దులూ శుభ్రంగా ఉండాలి. సినిమా కూడా అంతే..`` అని చెబుతోంది నిత్య‌. క‌రెక్టే క‌దా...?  మిగిలిన క‌థానాయిక‌లూ ఇలాంటి ష‌ర‌తులే వేస్తే.. ఇక మ‌న‌కు క్లీన్ సినిమాలే వ‌స్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: