ఎక్కడెక్కడో అవార్డులు, గుర్తింపులు తెచ్చుకున్న మోడ‌ల్స్ చూపు అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ల‌పైనే ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో అయితే ఫ్రెష్ హీరోయిన్‌ని అయినా పూల‌తో పూజిస్తారు, న‌చ్చితే రెమ్యున‌రేష‌న్‌ని పెంచి, ఆఫ‌ర్లనూ పెంచుతారు. అందుకే ఏ మోడ‌ల్ అయినా టాలీవుడ్ ఇండ‌స్ట్రీ నుండి పిలుపు వ‌స్తే ఇట్టే వాలిపోతారు.

ఆ విధంగానే 2012 మిస్ ఇండియా ప్రెష్ పేస్ గా నిలిచిన ఎరికా ఫెర్నాండెజ్‌ను ప్రిన్స్ మ‌హేష్ బాబు మూవీలో హీరోయిన్‌గా మాట్లాడేందుకు, ఓ ప్రొడ్యూజ‌ర్ అప్రోచ్ అయ్యాడట‌. విన్నర్‌గా ఉన్న జోష్‌లో, ఫిల్మ్‌ ఇండ‌స్ట్రీకు కొత్త కాబ‌ట్టి, టాలీవుడ్ కంటే బాలీవుడ్‌లోనే ఆఫ‌ర్లు కొట్టేస్తానులే, ఇప్పుడు టాలీవుడ్‌ ఆలోచ‌న లేదు అని చెప్పింద‌ట‌.

సీన్ క‌ట్ చేస్తే ఆ త‌రువాత ఊరు,పేరు లేని రెండు త‌మిళ్‌,రెండు హిందీ మూవీల్లో న‌టించి, ప్రిన్స్ ప‌క్కన ఛాన్స్ మిస్సయినందుకు బావురుమంద‌ట‌. లేటెస్‌గా బోయ‌పాటిశ్రీను,బాల‌య్య కాంబినేష‌న్ లో వ‌చ్చే మూవీకు బాల‌కృష్ణతో ఈ మిస్ ఇండియా న‌టిస్తుంద‌న్న వార్తలు ఎంత వ‌ర‌కూ నిజ‌మో తెలియ‌దు కాని, ప్రిన్స్ ప‌క్కన ఒప్పుకోనందుకు ఆ ప్రొడ్యూజ‌ర్ తెగ ఫీల్ అయ్యాడు, ఇప్పుడు ఆనంద‌ప‌డుతున్నాడంట‌. సుకుమార్‌,మ‌హేష్ ఒన్ మూవీ కోస‌మే ఈ మిస్ ఇండియాను బుక్ చేసుకున్నార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: