షారుక్‌ఖాన్‌కి త‌న మూవీను  ఏ విధంగా ప్రమోష‌న్ చేసుకోవాలో బాగా తెలుసు. రావ‌న్ మూవీ కోసం ఏకంగా యు-ట్యూబ్ పేజ్‌ను వీడియోగేమ్ చేసి నెటిజెన్లకు పిచ్చెక్కించాడు. తీరా మూవీను చూసిన ప్రతి ఒక్కరూ చెంబుతో త‌ల‌ను కొట్టుకున్నంత ప‌నైంది.

ఇప్పుడు షారుఖ్ లేటెస్ట్ మూవీ చెన్నైఎక్స్‌ప్రెస్ ప్రమోష‌న్ కూడ రావ‌న్ ప్రమోష‌న్‌ను గుర్తుకు తెస్తుంది. అస‌లే బాలీవుడ్‌లో ఖాన్‌ల మ‌ధ్య పోటీ కామ‌న్ కాబ‌ట్టి, అమీర్‌ఖాన్‌,స‌ల్మాన్‌ఖాన్ అభిమానులు షారుఖ్‌పై గాసిప్‌లు క్రియోట్ చేస్తున్నారు. చెన్నెఎక్స్‌ప్రెస్ పోస్టర్స్ అన్నింటిలోనూ షారుఖ్ చేతిలో ఓ చెంబు ప‌ట్టుకొని ఉంటాడు. చెంబులో ఏముంది, ప‌క్కనే దీపికా ఉండ‌గా అంటూ ఫేస్‌బుక్‌లో కామెంట్స్‌ను తెగ ప్రమోట్ చేస్తున్నారు.

 అంతేకాకుండా ఈ చెంబు గొడ‌వ కోళీవుడ్‌కి పాకి, పేరు చెన్నై ఎక్స్ ప్రెస్ కాబ‌ట్టి, ఇందులో త‌మిళ‌నాడును అవ‌మానించే సీన్స్ ఉంటే ముందుగానే తీసేయండి, లేకుండా మాకు ప్రివ్యూను చూపించండి అంటూ, త‌మిళ‌నాడు ఆత్మ గౌర‌వ సంఘూలు షారుక్‌ఖాన్‌కు ఓ లెట‌ర్‌ను పంపారు. ఈ విధంగా షారుఖ్ చేతిలో చెంబు, నెటిజెన్లకు కామెడీను తెప్పిస్తుంద‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: