ప్రిన్స్ మహేష్‌ ట్వీట్‌ వెనుక వాస్తవ కథ పై రకరకాల కధనాలు వినిపిస్తున్నాయి. మహేష్  చెప్పినట్టుగానే ట్విట్టర్‌ని నిజంగా హ్యాకర్లు హ్యాక్‌ చేశారా, మాటీవీ అవార్డు విషయంలో జరిగిన రభసకు కారకులెవరు? ఇదంతా మహేష్  ట్విట్టర్‌ని గ్రిప్ లో  పెట్టుకున్న భార్యామణి నమ్రత పనేనా. ఇలాంటి ఎన్నో ప్రశ్నల పై ప్రస్తుతం ఫిలింనగర్‌  ఆసక్తికర చర్చ జరుగుతోంది. మాటీవీ ఆఫీసులో అటెండెన్స్‌ ఉన్నవాళ్లకే అవార్డులిస్తారు. లేనివారికి ఇవ్వరు. మహేష్‌ ‘బిజినెస్‌మేన్‌’లో ఎంత బాగా నటించినా ‘బెస్ట్‌ హీరో’ జాబితాలో కనీసం అతడి  పేరైనా లేదు అని ఇటీవల మహేష్‌ ట్విట్టర్‌లో కామెంట్‌ రావడం ఆ వెంటనే దానిని డిలీట్‌ చేయడం..దానిపై ప్రిన్స్‌ వివరణ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.ఈ ఉదంతం ఫిల్మ్‌ ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురిచేసింది. 

అయితే మహేష్‌ ట్విట్టర్‌లో నడిచిన ప్రతి ట్వీటు డ్రామాకి అతడి భార్యా నమ్రత  శిరోధ్కర్‌ కారణమని వదంతులు వినిపిస్తున్నాయి. సదరు పోస్టింగు చేసింది కూడా ఈవిడే అనే అనుమానాలున్నాయి. ఎందుకంటే, మహేష్‌ ట్విట్టర్‌ని మేనేజ్‌ చేసేది నమ్రతే. అయితే అవార్డుల విషయంలో తన అభిప్రాయాన్ని తెలియజేయాలని ఓ మెసేజ్‌ టైప్‌ చేసిన నమ్రత అనుకోకుండానే పొరపాటున ఓకే చేసేసిందిట. ఆమె అభిప్రాయం నేరుగా మహేష్‌ ఖాతాలో చేరిపోయి ఇంత రభసకి కారణమైంది అని అంటున్నారు. అయితే ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? అన్నది మహేష్‌కే తెలియాలి. నంది అవార్డులు ఫిలిం ఫేర్ అవార్డులు మహేష్ కు కొత్త కాదు.

మహేష్ ఈ అవార్డుల స్థాయి దాటిపోయి టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి అతి చేరువలో ఉన్నాడు, అన్నది నిజం. ఒక ‘బిజెనెస్ మేన్’ సినిమాకు అవార్డు రాకపోయినంత మాత్రాన మహేష్ విలువ ఏమాత్రం తగ్గేది లేదు పెరిగేదిలేదు. మహేష్ ప్రస్తావన లేకుండా నేడు టాలీవుడ్ మీడియాలో ఒక్కరోజు కూడా గడవడం లేదు అంటే అతని స్థాయి ఏమిటో అందరికి అర్ధం అవుతుంది....

మరింత సమాచారం తెలుసుకోండి: