టాలీవుడ్ టాప్ హీరో ఎవ‌రు....ఈ టాపిక్ ఎప్పుడు మొద‌లు పెట్టినా..ఎవ‌రు స్టార్ట్ చేసినా ఇంట్రెస్టింగ్ గానే వుంటుంది.అందుకే టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ ఎవ‌రు అంటూ అప్పుడ‌ప్పుడు మ్యాగ‌జైన్స్, చానెల్స్ స‌ర్వే నిర్వహిస్తుంటాయి. ఇపుడు అదే ప‌ని చేసింది ఓ ప్రముఖ మ్యాగ‌జైన్. అయితే వ‌చ్చిన రిపోర్ట్ పై కొన్ని, కాంప్లిమెంట్స్, కంప్లైట్స్ విన‌బ‌డుతున్నాయి. ఆ స‌ర్వే ప్రకారం టాలీవుడ్ టాప్ 5 ఎవ‌రంటే.....

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్...........అత‌డి పేరులోనే ఏదో మ్యాజిక్ వుంటుంది.అందుకే ఆ పేరు విన‌బ‌డితే అభిమానుల గుండెలు ఒక్కసారిగా ఉప్పొంగుతాయి. అత‌డి ఫేస్ లో ఏదో ప‌వ‌ర్ వుంది. అందుకే అత‌డు తెర‌పై క‌నిపిస్తే అభిమానుల చ‌ప్పట్ల తో ధియేట‌ర్లు హోరెత్తుతాయి. అందుకే స‌ర్వే నిర్వ హించిన మ్యాగ‌జైన్ కూడా టాలీవుడ్ నెంబ‌ర్ వ‌న్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని తేల్చింది. నిజంగానే గ‌బ్బర్ సింగ్ నుండి పూర్వ వైభ‌వాన్ని తెచ్చుకుని ఇపుడు అత్తారింటికీ దారేదీ శాటిలైట్ రైట్స్ లోనూ త‌నే నెంబ‌ర్ వ‌న్ అనిపించుకున్నాడు ప‌వ‌న్.

ఇక సెకండ్ ప్లేస్ ని అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ప్రిన్స్ మ‌హేష్ బాబు ఆక్యూపై చేశారు. దూకుడు త‌రువాత వ‌రుస విజ‌యాల‌తో అందుకుంటున్న కార‌ణంగా ప్రిన్స్ ని సెకండ్ ప్లేస్ ఇచ్చామ‌ని మ్యాగ‌జైన్ తేల్చింది. అలాగే మూడో స్ధానంలో ర‌చ్చ‌, నాయ‌క్ విజ‌యాల‌తో జోష్ మీద వున్న రాంచ‌ర‌ణ్ నిల‌వ‌గా, ఊస‌ర‌వెల్లి, ద‌మ్ము, బాద్ షా యావ‌రేజ్ హిట్లతో నాలుగో స్ధానానికి దిగ‌జారాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ఇక ఐదో స్ధానాన్ని ఎవ‌రూ ఊహించ‌ని హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేజిక్కించుకున్నాడు. జులాయి, ఇద్దర‌మ్మాయిల‌తో వ‌రుస విజ‌యాలు అందుకోవ‌డ‌మే అల్లు అర్జున్ ని ఎంపిక అవ్వడానికి కార‌ణ‌మ‌ని మ్యాగ‌జైన్ తేల్చింది.

అయితే అంతాబాగానే వుందిగానీ మ‌రి యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ కి టాప్ 5లో ప్లేస్ ద‌క్కక‌పోవ‌డంపై అంద‌రు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ మద్య ఒక్క రెబ‌ల్ త‌ప్ప ప్రబాస్ వ‌రుస‌గా నాలుగు విజయాలు ద‌క్కించుకున్నాడు. అంతేకాక ఇపుడు 100కోట్ల భారీ ప్రాజెక్ట్ బాహుబలిలో న‌టిస్తున్నాడు. మ‌రి ఆ విష‌యాలు మ్యాగ‌జైన్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదా అంటూ కొంద‌రు మ్యాగ‌జైన్ స‌ర్వేపై కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: