తెలుగు సినిమాకి సంబంధించి పెద్ద హీరోలు ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఎందుకంటే బాక్సాఫీసు వద్ద ఎవడు ఓపెనింగ్స్ కొడతాడో వాడే పెద్ద హీరో. (అంటే తప్పుడు  ఓపెనింగ్స్, కలెక్షన్స్, సెంటర్స్ చూపించే వాళ్ళు కూడా పెద్ద హీరోలే). అయితే ఈ పెద్ద హీరోలు కూడా ఈ మద్య కాస్త కంట్రోల్ చేసుకోలేక పోతున్నారు. 
 

కంట్రోల్ చేసుకోలేక పోతున్నారు అంటే కొత్తగా వచ్చినా హీరోయిన్లను ఏమైనా చేస్తున్నారేమో అనే డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ టాపిక్ అది కాదు. ఇక్కడ టాపిక్ లీకేజ్. ఇప్పుడు మన అగ్ర హీరోలు  చేస్తున్న సినిమాల్లోని డైలాగ్స్ ఇవేనంటూ, సినిమా సెట్స్ పై ఉండగానే కొన్ని బయటకి వచేస్తున్నాయి. ఆ డైలాగ్స్ చూసి ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారని లీక్ చేస్తున్నారో లేక కావాలని క్రియేట్ చేస్తున్నారో తెలియదు కాని, ఒకటి తరువాత ఒకటి ఈ మద్య లీకుల పర్వాలు గమనిస్తూనే ఉన్నాం. 
 

మరి పెద్ద హీరోల సినిమాలు అనగానే మేకర్స్ చాలా కేర్ ఫుల్ గానే ఉంటారు. కానీ  డైలాగ్స్ ఇలా లీక్ అవుతున్నాయంటే ఎవరి పాత్ర ఎక్కవ ఉండి ఉంటుందో అందరికి తెలిసినా నిందపడేది మాత్రం హీరోల పైనే కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: