ఓ సినిమా మొద‌ల‌య్యే ముందే.. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల లిస్టు త‌యారైపోతుంది. అన్నింటిమీద ఓ క్లారిటీ వ‌చ్చాకే సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. కానీ... బాల‌కృష్ణ సినిమా మాత్రం క‌థానాయిక లేకుండానే మొద‌లైపోయింది. ఇటీవ‌లే రెండు సార్లు ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంమైంది. ఇప్పుడు నిజం షూటింగ్ మొద‌లుపెడ‌తారు. ఇక్క‌డ కాదు. దుబాయ్ ఎడారుల్లో. అవును..

బోయ‌పాటి సినిమా ఈనెల 15 నుంచి దుబాయ్‌లో మొద‌లు కానుంది.నంద‌మూరి అభిమానులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న రూల‌ర్‌... చ‌క‌చ‌క ముందుకు సాగ‌బోతోంది. హీరోయిన్ ఎవ‌రు?  అనే విష‌యం ఇంకా ఓ కొలిక్కి రాక‌పోయినా, రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొద‌లెట్టేస్తున్నారు.  ఎడారిలో... బాల‌కృష్ణ‌పై ఛేజింగ్ స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తార‌ట‌. ఈనెల 28 వ‌ర‌కూ షూటింగ్ అక్క‌డే జ‌ర‌గ‌నుంది.

తిరిగి వచ్చిన త‌ర‌వాతే హీరోయిన్‌ల‌ను ఎంపిక చేసుకొంటారు. ఇప్ప‌టికైతే మిస్ ఇండియా ఎరికా ఫెర్నాండేజ్ పేరు ప‌రిశీలిస్తున్నారు. ఇటీవ‌లే ఎరికా ఫొటో సెష‌న్‌లోనూ పాల్గొంది. ఎరికా ప‌ట్ల‌.. చిత్ర‌బృందం సంతృప్తిక‌రంగానే ఉన్నా... బాల‌య్య ఆమోద ముద్ర ప‌డాల్సివుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: