‘జగదేక వీరుడు,అతిలోక సుందరి’లో శ్రీదేవి కట్టిన చీరలు ఇప్పటికీ మరిచిపోలేము. ‘దేవదాస్’లో ఐస్వర్యారాయ్ వేసుకున్న నగలూ అప్పుడప్పుడూ గుర్తు కోస్తుంటాయి. ఇప్పుడ ఆ జాబితాలో దీపిక పదుకునే కళ్ళద్దాలు వచ్చి చేరాయి. ఆమె తాజా చిత్రం ‘ఏ జవానీ హై దివానీ’ విడుదలైన వారానికే వంద కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవడానికి దీపిక ఆకర్షణీయంగా కనిపించిన తీరె ప్రధాన కారణమట.

అందులో బాగా చదువుకున్న అమ్మాయిలా కనిపించే దీపిక, బ్రౌన్ కలర్, దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉన్న కళ్ళద్దాలను పెట్టుకుని కొత్త లుక్ లో కనిపించింది. ఆ స్టైల్ ఇప్పుడు యువతకు పిచ్చిగా నచ్చేసింది. అమ్మాయిలైతే అలాంటి అద్దాలే కావాలని మార్కెట్లోతెగ వెతికేస్తున్నారట. తనకు అంత పేరు తీసుకొచ్చిన కళ్ళద్దాలను ఎప్పటికీ తనతోనే ఉంచుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఒకవేళ భవిష్యత్  లో దీపికకు సైట్ వస్తే ఖచ్చితంగా ఇలాంటి అద్దాలనే తయారు చేయించుకుంటాను అని చెపుతోంది ఈ బాలీవుడ్ సుందరాంగి .

అంతేకాదు ఈ కళ్ళజోడు వల్లే తనకు ఇంత పేరొచ్చిందనీ మురిసిపోతోంది దీపిక. ఇంకెందుకు ఆలస్యం మన ఇంటిలోని అమ్మాయిలు కూడా దీపికలా మెరవాలి అంటే ఇటువంటి కళ్ళజోళ్ళు ఎక్కడ దొరుకుతాయో వేటాడితే సరిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: