మెగా బ్రదర్స్ అనగానే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గుర్తొచ్చేది చిరంజీవి అండ్ బ్రదర్స్. మేటర్ ప్రకారం వీళ్ళు కూడా అభినందనీయులే కానీఇక్కడ మనం అభినందించాల్సింది తమిళ్ మెగా బ్రదర్స్ గా పిలవబడే సూర్య అండ్ కార్తీలను. 
 

విషయం ఏమిటంటే ఈ మెగా బ్రదర్స్ చేసే సినిమాలకు వచ్చే మనీని పర్సనల్ గా వాడుకుంటూ, యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నారట. మన తెలుగు ఇండస్ట్రీలో యాడ్స్ ద్వారా కోట్లు సంపాదించే హీరోలు ఎవరికీ పెద్దగా హెల్ప్ చేసేనట్లు మనం వినలేదు. కానీ  ఈ బ్రదర్స్ మాత్రం యాడ్స్ చేసేదే సేవా కార్యక్రమాల కోసం అని తెలిశాక అభినందించకుండా ఉండగలమా.
 

సూర్య, కార్తీక్ లు ఇద్దరూ బ్రాండ్స్ ఎండార్స్ చేయడం ద్వారా వచ్చిన సొమ్ముని 'అగరం ఫౌండేషన్' కోసం వినియోగిస్తున్నారట. ఈ విషయంలో ఇద్దరూ తమ తండ్రి మాట ప్రకారం నడుస్తున్నందుకు నిజంగా మరోసారి వీళ్ళను తమిళ పరిశ్రమ మెచ్చుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: