తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్నంత‌మంది హాస్య‌న‌టులు మ‌రెక్క‌డా ఉండ‌రేమో?!  అందులో ఉద్దండులూ ఎక్కువే. గిన్నిస్ బుక్ ఎక్కిన‌వాళ్లూ ఉన్నారు. డాక్ట‌రేట్లు అందుకొన్న‌వాళ్లు ఉన్నారు. బ్ర‌హ్మానందం గిన్నీస్ బుక్ ఎక్కారు, గౌర‌వ డాక్ట‌రేట్ కూడా అందుకొన్నారు. ఇప్పుడు అలీ కూడా చేరిపోయాడు. ఇటీవ‌లే అలీకి కొయంబ‌త్తూరు యూనివ‌ర్సీటీ గౌర‌వ డాక్ట‌రేట్ అందించింది.

ఈ సంద‌ర్భంగా అలీని, బ్ర‌హ్మానందం ఇంటికి పిలిచి చిరు స‌త్కారం చేశాడు. ఇది.... హాస్య‌న‌టుల మ‌ధ్య ఉన్న ఆరోగ్య‌క‌ర‌మైన వాతావ‌ర‌ణానికి నిదర్శ‌నం.
అలీకి డాక్ట‌రేట్ వ‌స్తుంద‌ని బ్ర‌హ్మానందం ముందే చెప్పార‌ట‌. ``ఆయ‌న‌కు డాక్ట‌రేట్ వచ్చిన‌ప్పుడు నాతో ఓ మాట అన్నారు. నా త‌ర‌వాత నీకే డాక్ట‌రేట్ వ‌స్తుంది.. చూడూ..

అని చెప్పారు. ఆ మాట ఇప్పుడు నిజ‌మైంది అని అలీ పొంగిపోతూ చెబుతున్నాడు. డాక్ట‌రేట్ అందుకోవ‌డం కంటే, స‌హ న‌టుడి చేతిలో చిరు స‌త్కార‌మే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింద‌ట‌.
మ‌న ప‌రిశ్ర‌మ‌లో డాక్ట‌రేట్‌కి అర్హులైన హాస్య‌న‌టులు ఇంకా ఎంతోమంది ఉన్నార‌ట‌. వారంద‌ర‌కీ డాక్ట‌రేట్లు వ‌చ్చేస్తాయ‌ని... బ్ర‌హ్మానందం మ‌ళ్లీ జోస్యం చెబుతున్నారు. దాన్ని అందుకొనే త‌ర‌వాతి న‌టుడు ఎవ‌రో మ‌రి?!

మరింత సమాచారం తెలుసుకోండి: