మారుతి ఖాతాలోకి మ‌రో హిట్ వెళ్లిపోయింది. చిన్న సినిమాని భ‌లే క్వాలిటీగా తీశాడు.. అనే పేరు అత‌ని ఖాతాలోకి దిగ్విజయంగా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోగ‌లిగాడు. నిజానికి ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు జె.ప్ర‌భాక‌ర్‌రెడ్డిని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. పోస్ట‌ర్ల‌పై కూడా హీరో లెవిల్లో త‌న ఫొటో వేసుకొన్నాడు మారుతి. ఈ సినిమా క్రెడిట్ ఎట్టి ప‌రిస్థితిల్లోనూ త‌న చేయి దాటిపోకుండా అన్ని విధాలా జాగ్ర‌త్త ప‌డ్డాడు.ఈ స్ట్రాట‌జీ ఇప్ప‌టిది కాదు.

ఈ సినిమాకి కొబ్బ‌రికాయ కొట్టినప్ప‌టి నుంచీ మొద‌లైంది. నిజానికి ఈ సినిమాని మారుతినే స్వ‌యంగా డైరెక్ట్ చేయాల్సింది. చిన్న సినిమా ద‌ర్శ‌కుడు అనే ముద్ర ప‌డిపోతుందేమో అని ప్ర‌భాక‌ర‌రెడ్డి చేతిలో పెట్టాడు. వెనుక నుంచి అంతా తానై న‌డిపించాడు. ఈ సినిమా ఇంత హిట్ అవుతుంద‌ని మారుతి కూడా అనుకోలేదు. అందుకే.. విడుద‌ల‌కు ముందు పెద్ద హ‌డావుడి చేయ‌లేదు. 

హిట్ టాక్ బ‌య‌టకు వ‌చ్చాక మాత్రం - ఒక్క‌సారిగా విజృంభిస్తున్నాడు. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు మారుతినే అనే లెవిల్లో ప్రచారం చేసుకొంటున్నాడు. ఈ సినిమా పోతే గ‌నుక ప్ర‌భాక‌రెడ్డిమీద‌కు తోసేసేవాడేమో..?!  మొత్త‌మ్మీద మారుతి పంట పండిందిప్పుడు. పాపం.. సిస‌లైన ద‌ర్శ‌కుడు మాత్రం మారుతి వెన‌కే నిల‌బ‌డిపోయాడు. గ‌ప్‌చుప్‌గా...!

మరింత సమాచారం తెలుసుకోండి: