ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలకు సిక్స్ ప్యాక్ హవా నడుస్తోంది. అల్లుఅర్జున్, ప్రభాస్, సునీల్, రానా  రామ్ చరణ్ లు తమ చొక్కాలను విప్పి తమ బాడీలను చూపించే ప్రయత్నాలు చేసారు. ఇప్పుడు ఈ విషయంలో తాము ఏమి తక్కవ కాదంటూ ప్రిన్స్ మహేష్ బాబు ఎన్టీఆర్ లు చేరిపోతున్నారు. ఆరు పలకలు, ఇంకా అవసరం అనుకుంటే ఎనిమిది పలకలకు కూడా రెడీ అయిపోతున్నారు. లేటెస్టు గా   హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘రామయ్యా వస్తావయ్య’ సినిమాలో ఎన్టీఆర్‌ సిక్స్‌ప్యాక్‌లో కనిపించి అభిమానులను అలరించనున్నాడు. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఇదే హాట్‌ టాపిక్‌. కానీ ఓసారి చరిత్రని పరిశీలిస్తే.. పెద్ద హీరోలకు ఈ ప్యాకింగులేవీ కలిసిరాలేదు. ‘దేశముదురు’తో కండలు పెంచిన బన్ని..అసలు సిసలు 6ప్యాక్‌ చూపించింది ‘వరుడు’ సినిమాలోనే. ఆ సినిమా ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. పూరీ.. ప్రభాస్‌ని ‘బుజ్జిగాడు’లో సిక్స్‌ప్యాక్‌తోనే చూపించాడు.

అయినా ప్రభాస్ బాక్సాఫీస్‌ దగ్గర దారుణంగా ఫెయిలయ్యాడు. ఎట్టకేలకు 6ప్యాక్‌ జాబితాలో మహేష్‌ పేరు చేరినా..‘వన్‌’లో ప్రిన్స్‌ చొక్కా విప్పి చూపిస్తాడో లేదో డౌటే ఒకసారి సిక్స్ ప్యాక్ ఉంది అంటున్నారు, మహేష్ మాత్రం లేదు అంటున్నాడు. ఈ నేపథ్యంలో జూనియర్‌ 6ప్యాక్‌పై మాత్రమే ‘రామయ్యా వస్తావయ్యా’ సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. రెండున్నర గంటలు ఉండే సినిమాలో ఏ హీరో సిక్స్ ప్యాక్ అవతారమైనా రెండు మూడు నిముషాలు మించి ఉండదు. ఆ సీన్స్ కూడా ఆహీరోల అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తాయి కానీ సాదారణ ప్రేక్షకులను మాత్రం కాదు.  

ప్యాక్‌ ఉంటేనే సినిమాలు ఆడతాయి అనుకోవడం అవివేకం. అదీకాక ఆరడుగుల పొడుగు ఉండే హీరోలకు సిక్స్ ప్యాక్ అవతారం నప్పుతుంది కానీ, పొడుగు విషయంలో చాలామంది తోటి హీరోలతో వెనుక బడి ఉండే ఎన్టీఆర్ కు ఈ సిక్స్ ప్యాక్ అవతారం ఎంతవరకు నప్పుతుంది అన్నది సందేహమే. అందువల్ల మన టాప్ యంగ్ హీరోలందరూ ఈ పలకల దేహలపై కాకుండా నటన పై తమ సినిమాల కధలపై దృష్టి పెట్టినట్లైతే బాగుంటుందేమో.. యంగ్ హీరోలు ప్యాక్ లను మరిచిపోండీ....

మరింత సమాచారం తెలుసుకోండి: