టాలెంట్ ఉంటే చాలు. అనుభ‌వం లేక‌పోయినా ఫ‌ర్లేదు. - ఇదీ ప్ర‌స్తుతం చిత్ర‌సీమ న‌మ్ముతున్న మాట‌. స్టార్ హీరోలు కొత్త ద‌ర్శ‌కుల‌కు అవకాశం ఇచ్చినా, అగ్ర ద‌ర్శ‌కులు కొత్త కుర్రాళ్ల‌తో సినిమా తీసినా ఈ సిద్ధాంతాన్ని న‌మ్మే. ఒక్క హిట్ కొట్ట‌గానే అంద‌రూ వాళ్ల చుట్టూ తిరుగుతుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే చేస్తున్నాడు.

హిట్టు ద‌ర్శ‌కుడిని రా..రా అంటు పిలుస్తున్నాడు.స్వామి రారా సినిమాతో తొలి అడుగులోనే విజ‌యం సొంతం చేసుకొన్నాడు సుధీర్ వ‌ర్మ‌. చిన్న సినిమా అయినా, చాలా క్వాలిటీగా తీయ‌గ‌లిగాడు. వ‌ర్మ ఛాయ‌లు అక్క‌డ‌క్క‌డా క‌నిపించాయి. దాంతో - సుధీర్ పై టాప్ హీరోల దృష్టి ప‌డింది. రామ్‌చ‌ర‌ణ్ సైతం సుధీర్ వ‌ర్మ‌కు ఫోన్ చేసి అభినందించాడు.

ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ ఆఫ‌రే ఇచ్చేశాడు.ఎన్టీఆర్ - సుధీర్‌వ‌ర్మ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోవ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఎన్టీఆర్‌కి, వ‌ర్మ ఓ క‌థ‌కూడా వినిపించేశాడ‌ట‌. అది న‌చ్చ‌డం, ప‌చ్చ‌జెండా ఊప‌డం - చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి. బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి నిర్మాత. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: