పాపం.. బాల‌కృష్ణ‌కు క‌థానాయిక‌ల సమ‌స్య ఇప్ప‌ట్లో తీరేట‌ట్టు లేదు. దొరికిన ఒక్క హీరోయిన్ కూడా... నే చేయ‌ను ఫో.. అనేసింద‌ట‌. బాల‌కృష్ణ‌-బోయపాటి శ్రీ‌ను క‌ల‌యిక‌లో ఓ చిత్రం ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమాలో ఇద్ద‌రు క‌థానాయిక‌లు కావాలి. దాని కోసం మూడు నెల‌లుగా తీవ్ర‌మైన అన్వేష‌ణ జ‌రుగుతోంది. అయినా ఒక్కరూ దొర‌క‌లేదు. మిస్ ఇండియా ఎరికా ఫెర్నాండేజ్ - బాల‌య్య పక్క‌న న‌టిస్తోందని,

వీరిద్ద‌రి కాంబినేష‌న్ సెట్ట‌య్యింద‌ని చెప్పుకొన్నారు. అయితే అవ‌న్నీ గాలివార్తలేన‌ట‌. ఈ విష‌యం ఎరికా ట్విట్ చేసింది.బాల‌కృష్ణ సార్‌తో.. సినిమా చేస్తున్నాన‌నే వార్త‌ల్లో నిజం లేదు. నేను ఈమ‌ధ్య ఏ తెలుగు సినిమానీ ఒప్పుకోలేదు.. అని ట్విట్ చేసింది ఈ మిస్ ఇండియా. దాంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. బాల‌కృష్ణ కోసం దాదాపు అర‌డ‌జ‌ను మంది క‌థానాయిక‌ల్ని సంప్ర‌దించ‌డం, వారు నో చెప్ప‌డం జ‌రుగుతున్నాయి.

కార‌ణం ఏమిటో అర్థం కావ‌డం లేదుగానీ బాల‌య్య ప‌క్క‌న న‌టించ‌డానికి అమ్మాయిలు స‌ముఖ‌త చూపించ‌డం లేదు.అంత‌గా కాదంటే, భారీ పారితోషికం ఇచ్చ‌యినా స‌రే, బాలీవుడ్ భామ‌ల్ని రంగంలోకి దింపాల‌ని... నిర్మాత‌లు భావిస్తున్నారు. మ‌రి... బాల‌య్య ప‌క్క‌న భామ‌లెవ‌రొస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: