టాలీవుడ్ లో బ్రహ్మనందం మిగ‌తా క‌మెడీయ‌న్స్ ని తొక్కేస్తాడ‌ని ఓ నింద వుంది. ఆ మద్య ఓ కమెడియ‌న్ ఏకంగా ఓ చాన‌ల్ లైవ్ ప్రొగ్రామ్ లో బ్రహ్మిపై చాలా నింద‌లే వేశాడు. కానీ ఆయ‌న క‌మెడియ‌న్స్ తో ఎంత అత్మీయంగా వుంటాడో తెలిపే సంఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. అదేంటంటే ఈ మ‌ద్యే ఆలీ డాక్టరేట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. నిజానికి ఆలీ డాక్టరేట్ అందుకున్నాక ఫిల్మ్ ఇండ‌స్ట్ట్రీలో ఆయ‌న‌ను అంత‌గా ఎవ్వరూ స‌న్మానించ‌లేదు.

కానీ డాక్టర్ బ్రహ్మనందం దంపతులు మాత్రం ఆలీని ఇంటికి పిలిచి మ‌రీ ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సంద‌ర్బంగా ఆలీపై బ్రహ్మి ప్రశంస‌ల వ‌ర్షం కురిపించారు. పూరి జ‌గ‌న్నాద్ సినిమాల్లో ఆలీ కామెడీ నాకు బాగా న‌చ్చుతుంద‌ని, పూరి సినిమాలు ఆలీ కామెడీ వ‌ల్లే బ్లాక్ బ్లస్టర్స్ అయ్యాయ‌ని పొగిడారు.ఇక ఆలీ కూడా నాకు డాక్టరేట్ ని మించిన ఆనందం అన్న బ్రహ్మనందం స‌త్కారంతో కలిగింద‌ని చెప్పారు. ఈ వేడుక‌లో హీరో సునీల్, న‌టులు కృష్ణభ‌గ‌వాన్, శ్రీనివాస‌రెడ్డి, గుండు హానుమంత‌రావు పాల్గోని ఆలీని అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: