ఆ సినిమాలో పనిచేసిన వారంతా పెరున్నవారే, అంతేకాదు సినిమా నిర్మాణం పట్ల అవగాహనా ఉన్నవారే. కానీ ఆ సినిమాను నాలుగు స్థంబాలు గా మోస్తున్న ఆ నలుగురికీ ఈ మధ్య కాలంలో రవ్వంత అదృష్టం కూడా లేదు. కానీ ధైర్యంగా వారంతా కలిసి 30 కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ సినిమాతీసి సాహసం చేస్తున్నారు.  ఆ సినిమా పేరు ‘సాహసం’ ఈ సినిమా టైటిల్ కు నిర్మాత పరిస్థితికి బాగా మ్యాచ్ అవుతోంది. ఈ సినిమా నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్…గతంలో ‘ఊసరవెల్లి’ , ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి సూపర్ డూపర్ ఫ్లాఫు సినిమాలను తీసిన ఘనత ఈయనదే. ఇటువంటి పరిస్థుతులలో ఉన్న నిర్మాత అదృష్టం ఉన్న వారిని ఎంచుకుంటాడు.

అయితే  ఫెయిల్యూర్స్ లో ఉన్న వారిని నమ్ముకోవడంతోటే ఈ నిర్మాత కచ్చితంగా సాహసం చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గతంలో ‘ప్రయాణం’ అనే సినిమాతో పర్వాలేదనిపించినా ఈ యన కెరీర్ లో అంత చెప్పుకోదగ్గ సూపర్ హిట్టేమీ లేవు. ఇక గోపిచంద్ పరిస్థితి తెలిసిందే. ‘వాంటెడ్ ‘ ‘మొగుడు’ వంటిసినిమాలు ఒక దాన్ని మించి మరోటి ఫెయిలయ్యాయి. ఇక తాప్సీకి తొలి సినిమా పర్వాలేదనిపించింది కానీ… ఆ తర్వాత ఆమెకు హిట్ దక్కింది లేదు! ఒకరు ఫామ్్లో లేకుంటే ఏదోలే అనుకోవచ్చు కానీ… ఈ సినిమాకు నాలు గు స్తంభాల్లాంటి దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్…ఇలా అందరూ ఔట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నారు .

మరి వీరిలో ఎవరి అధృష్టం అడ్డం తిరిగి ‘సాహసం’ సినిమాను కాపాడుతుందో! చూడాలి ఇండో పాకిస్తాన్ బోర్డర్ లో ట్రజర్ హంట్ నేపధ్యంలో భారీ బడ్జెట్ తో తీసిన సినిమాకు అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకే కాబోలు ధైర్యం చేసి అల్లరోడి యాక్షన్ త్రీడి సినిమా తో పోటీ గా వచ్చే వారం వచ్చేస్తోంది ఈ ‘సాహసం’.... ఆ నలుగురి సాహసం హిట్ కొట్టేనా??

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: