కేరళ వాళ్ళు తెలివైన వాళ్ళు ఆ తెలివి తేటలతో వారు ప్రపంచంలో ఎక్కడైనా బ్రతికేస్తారు. అదే కేరళా నేపధ్యం నుంచి వచ్చిన మలయాళీ భామ అమలపాల్ కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటు తెలుగు, అటు తమిళ ఇండస్ట్రీలో ఆమె ఇప్పుడు ఫుల్ బిజీ. అది కూడా ఆయాభాషల్లో టాప్ హీరోలతో అమల పెయిర్ అవుతోంది! మాస్ , భారీ బడ్జెట్ సినిమాలైన వాటిలో అమల పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేకపోయినా, గ్లామర్ ఒలకపోయడానికి మాత్రం బాగా అవకాశం దొరుకుతోంది.

ఎక్ప్ పోజింగ్ విషయంలో ఏ మాత్రం మొహమాటంలేని అమలకు కావాల్సింది కూడా ఇదే! తను గ్లామరస్ గా కనిపిస్తే మరిన్ని అవకాశాలు వస్తాయని తను భావిస్తోంది. అమలకు మొహమాటం లేనిది కేవలం అందాలను చూపించడం లో మాత్రమే కాదట! అవకాశాలను అడగడంలో కూడా అమల వెనుకాడటం లేదని టాక్. పెద్ద హీరోలతో పరిచయాలు పెంచుకుని, వారినే డైరెక్ట్ గా సినిమా అవకాశాలను అడుగుతోందట అమల. మీతో కలిసి స్క్రీన్ మీద రొమాన్స్ చేయాలని  ఉంది, మీతో కలిసి డ్యుయెట్ కు డాన్స్ చేయాలని ఉందంటూ... అమల చాలా తెలివిగా హీరోలను దారికి తెచ్చుకుంటోందని వినికిడి. కొందరు మొహమాటంతో, మరి కొందరు నిజంగానే అమలపై ఆసక్తితో ఛాన్సులు ఇస్తున్నారట.

ఈ విధంగా అమలపాల్ దూసుకుపోతోంది. దీంతో బతక నేర్చిన హీరోయిన్ అమలాపాల్ అని అటున్నారంతా. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లో బిజీగా ఉన్న అమలాపాల్  తమిళంలో తాను నటించిన మొదటి సినిమాతోనే అవార్డులను కొట్టేసింది. కేవలం అందాలు ఒలికించడమే కాకుండా అమలలోని నటనను చూపెట్టే పాత్రలను ఈ మేకు మన దర్శకులు ఇస్తే బాగుంటుంది.....

మరింత సమాచారం తెలుసుకోండి: