హీరో సిద్దార్థ్, హీరోయిన్ హన్సిక, నెంబర్ వన్ కమెడియన్ బ్రహ్మనందం తారాగణంగా వచ్చిన సినిమా కథ ఇరగదీస్థది అని వెల్లిన వారికి మాత్రం నిరాశే మిగిలుస్థుంది సమ్ థింగ్ సమ్ థింగ్ సినిమా. అలా అని సినిమాకు ఎందుకు వచ్చాం రా బాబు అని తల బాదుకోకుండా సినిమాను చివరివరకు చూసేలా మాత్రం ఉంది.

సాదాసీదా ప్రేమకథ, హీరో హీరోయిన్ ను ప్రేమిస్థాడు, హీరోయిన్ ను ప్రేమలో పడేసుకుం టడు, అంతే తప్ప ప్రేమించుకోవడంలో కాని, ప్రేమలో పడేసుకోవడంలో కాని ఎలాంటి కొత్త దనం లేకపోయినా ఫర్వాలేదనుకుంటే అమ్మాయిలు ప్రేమలో పడడానికి మనసు కలవాల్సిన పనిలేదు, అబ్బాయిలు ట్రిక్కులు ప్లే చేస్థే పడిపోతారు అని చూపించిన ఏకైక సినిమా ఇది.

హీరో కు తగ్గ పాత్రలేదు, హీరోయిన్ కు తగ్గ గ్లామర్, యాక్షన్ సీన్స్ అసలే లేవు,  ప్రేమ అనే గొప్ప అంశమే ప్రధానంగా తీసుకుని దాని గొప్పదనాన్ని చూపించక పోయినా, కేవలం ట్రిక్కులతో ప్రేమను పొందవచ్చు అని చెప్పడం నేటి యువతరానికి మంచిది కాదేమో అనిపించింది. ఈలలు వేద్దామంటే అదిరే డ్యాన్స్ లు, హుషారెత్తించే పాటలు లేవు అని సరిపెట్టుకుంటే కుర్రకారు ఇష్టపడే ఫైట్స్ అసలే లేవు. ప్రేమలో పడేసుకోవడం, దానికోసం పడే కష్టాలకు బ్రహ్మానందం అంతా తానై నడిపించడంతో సినిమా పరమ చెత్త కోటా లోకి పోకుండా పరువు దక్కించుకుంది. ఇక డైరెక్షన్, కథ, పాటలు, ఫోటోగ్రఫి, వంటి సాంకేతిక వర్గం గూర్చి ప్రస్థావించకపోవడమే బెటర్.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: