సమంత  ప్రస్తుతం షూటింగ్ లలో తెగ బిజీ గా ఉంటోంది . ప్రస్తుతం ఏ స్టూడియో లో చూసినా సమంత సినిమాలే కనిపిస్తూ న్నాయి. ప్యారిస్, బ్యాంగ్ కాక్, యూరప్ ఇలా అన్ని దేశాలు చుట్టేస్తోoద. అయినా ఇంత వొత్తిడి లో కూడా    తన  ట్విట్టర్లో తెగ యాక్టివ్‌గా ఉంటోంది, అంతేకాదు ప్రతీరోజూ ఏదో సంగతి చెబుతూ తన  అభిమానులకు షాక్ ఇస్తూనే ఉంది. తాజాగా ఆమె తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్న విషయాలు అభిమానులను మరింత ఆశ్యర్యానికి గురి చేసాయి.

ఇటీవల ఓ కిడ్‌తో షూటింగులో పాల్గొన్న సమంత, అమ్మలా ఫీలయిందట. ఈ విషయమై ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ ‘చిన్న బాబుతో షూటింగ్ ఆ బాబు నన్ను కౌగిలించుకున్నాడు వాడి  చిన్నిచిన్ని చేతులతో నన్ను గట్టిగా పట్టుకున్నాడు....ఆ సమయంలో అమ్మలా ఫీలయ్యాను' అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సమంత అక్కినేని ఫ్యామిలీ మూవీ ‘మనం' చిత్రంలో నటింస్తోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని తన ట్విట్టర్లో వ్యాఖ్యానిస్తూ ప్రతి కొత్త సినిమా ప్రారంభం ముందు కాస్త నెర్వస్ అవుతాను. ఇప్పుడు కూడా అలాగే అయింది అంటూ వ్యాఖ్యానించింది.

 ప్రస్తుతం ఆమె ‘అత్తారింటికి దారేది’  ‘రామయ్యా వస్తావయ్యా’, ‘రభస’, ‘మనం’, వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందబోయే మూవీతో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లో చేస్తోంది. ఈ రోజు విడుదలైన సంథింగ్ సంథింగ్ చిత్రంలో సమంత అతిథి పాత్ర చేసింది . సమంత లోని సహజ సిద్దమైన అమ్మ మనసు బయటికి వచ్చింది కాబట్టి ఇక సమంత పెళ్ళి పీటలు ఎక్కడం ఖాయం అనుకోవాలి.....
 

మరింత సమాచారం తెలుసుకోండి: