97 సినిమాల ట్రాక్ రికార్డు ఆయన సొంతం పేరుమోసిన మహానటుడి కుమారుడిగా పుట్టడం ఆయన అదృష్టం ఆయనే నందమూరి బాలకృష్ణ. గత తొమ్మిది నెలలుగా షూటింగ్ లకు దూరంగా ఉంటూ రకరకాల ఉహాగానాల తరువాత ఎట్టకేలకు ఈ నందమూరి సింహం కొత్త సినిమా ఈ మధ్యనే బాలయ్య పుట్టిన రోజు నాడు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ‘సింహ’ తరువాత బోయపాటి బాలయ్యల కాంభినేషన్ కాబట్టి ఈ సినిమా పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. కానీ సమస్య అల్లా ప్రస్తుతం బాలయ్య వయస్సు కు సరిపడా హీరోయిన్ దొరకకపోవడంతో దర్శకుడు బోయపాటి దివిటీ పట్టుకుని దేశమంతా హీరోయిన్ వేటలో ఉన్నాడట. మొన్నటిదాకా మిస్ ఇండియా గా ఎంపికైన సుందరాంగి ఎరికా ఫెర్నాండేజ్ బాలయ్యతో రోమేన్స్ చేయబోతోందని వార్తలు రావడంతో బాలయ్య అభిమానులు చిందులు వేసారు.

 కానీ ఈ వార్త వచ్చిన ఒక్కరోజు తిరకుండానే మిస్ ఇండియా ఎరికా ఈ వార్తలను ఖండించింది. బొంబాయిలో పేరుగాంచిన లీడింగ్ మోడల్స్, హీరోయిన్స్ ఇలా ఎవరిని సంప్రదించినా బాలయ్య పేరు చెప్పగానే పరిపోతున్నారట. దీనికి ప్రధానకారణం బాలకృష్ణ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే వెంటనే ముదురు బ్రాండ్ ఇమేజ్ పడిపోతుందని వీరి భయమట. అంతేకాదు ఎ కుర్ర హీరో వీరి పక్కకురారని భయమట. ఈ పరిస్థితులలో సాహసం చేసి నయనతరానో, త్రిషానో ఒప్పిద్దామంటే ఈ విషయంపై దర్శకుడు బోయపటికి ఇష్టం లేదట
.

ఇటువంటి నేపధ్యంలో ఎంతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమాకు హీరోయిన్ ఎప్పుడు దొరుకుతుంది. అసలు బాలయ్యకు గ్లామరస్ భామ దొరుకుతుందా దొరకదా అనే విషయంపై ఫిలింనగర్ లో రకరకాల జోక్స్ పడుతున్నాయి. పాపం బాలయ్య హీరోయిన్ కష్టాలు తీరేది ఎప్పుడో.... బోయపాటి అన్వేషణ  ముగిసేది ఎప్పుడో ? 

మరింత సమాచారం తెలుసుకోండి: