టాలీవుడ్‌లో ఎవ‌రైన కొత్త హీరోయిన్ వ‌చ్చిందంటే చాలు. త‌న‌కి ఫేం ఉండాల్సిన అవ‌స‌రం లేదు. ఫిజిక్‌,బ్యూటి ఫ‌ర్‌ఫెక్ట్‌గా ఉంటే చాలు. ఆ హీరోయిన్‌ని ఇట్టే ట్రాప్‌లో ప‌డేస్తాడు ఈ హీరో. కొత్త బంగారు లోకంతో కాలేజ్ కుర్రాడిలా సిల్వర్ స్క్రీన్‌కు ఎంట‌ర్ అయి, హీరోయిన్స్‌కు ప్రియుడు అవుతున్నాడు.

శ్రద్ధాదాస్ ఇత‌గాడి గురించి స్టైట్‌గానే చెప్పింది. నేను 1 సంవ‌త్సరం పాటు వ‌రుణ్‌తో డేటింగ్ చేశాను అని. అంతే కాకుండ, టాలీవుడ్ మిత్రవింద కాజ‌ల్ అగ‌ర్వాల్ చెల్లితోనైతే మ‌రింత క్లోజ్‌గా ప‌రిచ‌యాలు కొన‌సాగిస్తున్నాడు. నిషా అగ‌ర్వాల్‌కి వ‌రుణ్ అంటే తెగ పిచ్చి. మేమిద్దర‌మే టాలీవుడ్‌లో టాప్ హిట్ పెయిర్ అన్నట్టు, వీళ్ళ మూవీల్లో బెడ్ సీన్లు కంప‌ల్సరిగా పెట్టుకుంటున్నారు.

ఎక్కడిదాకో ఎందుకు, మెగాహీరో అల్లుఅర్జున్ స‌ర‌స‌న న‌టించిన కేథ‌రిన్ థెరిస్సా న‌టించిన మొద‌టి తెలుగు మూవీ వ‌రుణ్‌తోనే. టాలీవుడ్‌లో హీరోయిన్లను ఎలా ఉప‌యోగించుకోవాలో తెలిసిన వాడు ఒక్క వ‌రుణ్ మాత్రమే అని కొంద‌రు చెబుతున్న మాట‌. మొత్తానికి టాలీవుడ్ ప్లేబాయ్‌గా హీరోయిన్స్ దృష్టితో త‌న‌దైన ముద్రవేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: