దీపం వుండ‌గానే ఇల్లు చ‌క్క దిద్దుకోవాలని పెద్దల సామెత‌. ఈ సామెతను ఒంట ప‌ట్టించుకోవ‌డంలో హీరోయిన్స్ త‌రువాతే ఎవ‌రైనా. ఒక్క హిట్ ప‌డిందా....? ప‌్రొడ్యుస‌ర్స్ కి మిట్ట మ‌ద్యాహ్నం చుక్కలు చూపిస్తారు. ఇపుడు అదే ప‌ని చేస్తోంది బాలీవుడ్ ల‌క్కీ గాళ్ సోనాక్షి సిన్హ.

ఫ‌స్ట్ సినిమానే బాలీవుడ్ టైగ‌ర్ స‌ల్మాన్ తో న‌టించే ఛాన్స్ రావ‌డం....అది సూప‌ర్ హిట్టవ్వడం...ఆ త‌రువాత న‌టించిన రౌదీ రాధోడ్, స‌న్నాఫ్ స‌ర్ధార్ సినిమాలు కూడా వ‌రుస‌గా హిట్ అవ్వడంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవ‌రంటే సోనాక్షి పేరే చెప్పాల్సిన పరిస్ధితి. అందులోనూ వ‌రుస విజియాలు ప‌డితే గోల్డెన్ లెగ్ అని ముద్దుగా పిలుచుకునే ఫిల్మ్ ఇండస్ట్ట్రీలో సోనాక్షిని స‌ల్లూబాయ్, అక్షయ్ త‌మ ల‌క్కీ హీరోయిన్ గా ఫీల‌వుతున్నార‌ట‌. ప్రస్తుతం లుటేరా సినిమా చేస్తోన్న సోనాక్షి కాల్షీట్స్ కోసం ఆమె ఇంటి చుట్టూ ప్రొడ్యుస‌ర్స్ చ‌క్కర్లు కొడుతున్నార‌ట‌. ఇదే అద‌నుగా భావించిన ఈ బీహార్ బ్యూటీ త‌న రెమ్యూన‌రేష‌న్ 10 కోట్లకు అమాంతం పెంచేసింద‌ట‌.

అయితే నిన్నటిదాకా 6 కోట్లు పార‌తోషికం తీసుకున్న ఈ భామ ఇపుడు స‌డ‌న్ గా 10 కోట్లుకు రెమ్యూన‌రేష‌న్ పెంచడం ఏమైనా బాగుందా అని అడిగితే త‌ప్పేంముంది ...ప్లాప్ హీరోయిన్స్ కి, పెళ్లైన భామ‌ల‌కే ఇస్తుండ‌గ‌లేంది ....వ‌రుస విజయాల హీరోయిన్ ని నాకు ఇస్తే త‌ప్పేంట‌ని లాజిక్ లాగుతోంది సోనాక్షి. ...దీంతో అబ్బో సోనాక్షి లాజిక్ మ‌రీ ఇంత కాస్టా అంటున్నారు కొద్దిమంది.

మరింత సమాచారం తెలుసుకోండి: