రామ్‌చ‌ర‌ణ్ జంజీర్ మూవీ కోర్టు గొడ‌వ‌ల‌తో ఆగిపోయిన విష‌యం అందరికి తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ జంజీర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో, కాదో ఇలా ర‌క‌ర‌కాల అనుమానాలు ప్యాన్స్‌ను వేధిస్తున్నాయి. ఇప్పుడు ఆ స‌మ‌స్య తొలిగిపోయింది. జంజీర్ రెట్టింపు ఉత్సాహంతో, ఫ్యాన్స్‌ను ఉత్సాహ‌ప‌ర‌చడానికి రెడీ అయ్యాడు.

జంజీర్ డైరెక్టర్ అపూర్వ ల‌ఖియా, మెగా అభిమానుల‌కు స్వీట్ న్యూస్‌ను అందించాడు. జంజీర్ మూవీ ప్రోమోస్ ఈ నెల చివ‌రి వారంలో విడుద‌ల‌వుతాయి. ప్రమోష‌న్ జులై నుండి ఫుల్ జోష్‌తో దూసుకువెళుతుంది. సిల్వర్ స్క్రీన్‌ను ఢీ కోట్టేందుకు జంజీర్ రెడీ అంటూ ట్వీట్ చేశాడు.

దీంతో మెగా అభిమానుల‌కు ఎక్కడ‌లేని ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. ఎవ‌డు మూవీ రిలీజ్‌ జులైలో ఉండ‌టంతో, దాని త‌రువాత నెల‌లోనే జంజీర్ కూడ రిలీజ్ ఉంటుందని టాలీవుడ్ చెబుతుంది. ఇలా వ‌రుస‌గా రామ్‌చ‌ర‌ణ్ మూవీలు ప‌ట్టాలెక్కడంతో టాలీవుడ్ షేక్ అవుతుంది. బాలీవుడ్‌లోనూ జంజీర్ ప్రమోష‌న్‌కు స‌న్నాహాలు మొద‌లుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: