మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పంచ్ డైలాగులంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు బలే మోజు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సున్నిత హాస్యం తో కూడిన త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ చాలా ఉన్నాయట.

 పంచ్ డైలాగులను పలకటంలో టాలీవుడ్ స్పెషలిస్ట్ హీరో పవన్ కళ్యాణ్ ఈ డైలాగులను జనానికి నచ్చే విధంగా పలుకుతూ సీన్స్ విరగాతీస్తున్నాడని టాక్. ఈ సినిమాకి సంబందించిన ఒక డైలాగ్ తిరుపతి ప్రసాదంతో లింక్ చేసి త్రివిక్రమ్ అద్భుతంగా పవన్ నోటి వెంట డైలాగ్ చెప్పించాడని ఫిలింనగర్ టాక్ .

ఒక సన్నివేశంలో బయటకు వెళుతున్న సమంతను చూసి పవన్ తను కూడా ఆమె తో బయటకు వస్తాను అంటాడట. దానికి సమంత బదులిస్తూ ‘రెండు అంటే కుదరదు అయితే సినిమా లేదంటే షాపింగ్ డిసైడ్ చేసుకో ఎక్కడకు వస్తావో’ అంటుదట. దానికి బదులుగా పవన్ ‘తిరుపతి తీసుకు వెళ్ళి ప్రసాదం కావాలా దర్శనం కావాలా? అంటే నాలాంటి భక్తుడు ఏమి డిసైడ్ చేసుకోగలడో చెప్పు’  అని అంటాడట. ఈ సినిమాలో సమంత డామినేటింగ్ పాత్ర చేస్తే ఆమెను తన దారికి తెచ్చుకునే పాత్రలో పవన్ కనిపిస్తాడు. కనీవిని ఎరుగని భారీ పారితోషికానికి ఈ సినిమా సాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడం, చూస్తూ ఉంటే ఈ సినిమా పై ఎన్ని అంచనాలు ఉన్నాయో అర్ధమౌతుంది...  

మరింత సమాచారం తెలుసుకోండి: