ప్రెజెంట్ పవర్ స్టార్ కి ఉన్న ఫాలోయింగ్ చూస్తె మెంటల్ వచ్చేస్తది. ఇది అందరూ ఎకీభవించాల్సిందే. అందుకే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లో రావు రమేష్ తో ఈ డైలాగ్ సరిగ్గా చెప్పించాడు. మరి ఇలాంటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ పై రోజుకో న్యూస్ వస్తుంటే ఆ ఫాలోయింగ్ తట్టుకోగలదా?
 
పవన్ గురించి గత నెల, రెండు నెలలుగా విపరీతమైన గాస్సిప్స్ పుడుతున్నాయి. అంతకు ముందు చిరంజీవి, పవన్ కి మధ్య చిన్నపాటి వార్ జరుగుతుందని వస్తే, చిరంజీవితో పాటు నాగబాబు, రామ్ చరణ్ స్పందించి ఖండించారు తప్ప అప్పుడు కూడా పవన్ ఏమి మాట్లాడలేదు. ఈ మధ్య పవన్, తన భార్య రేణు దేశాయ్ మధ్య చాలా దూరం పెరిగిందని, విడాకులు కూడా అయ్యాయని, కొంత అమౌంట్ తో మేటర్ సెటిల్ అయిందని వినపడింది. అంతే కాదు తీనమార్ లోని అమ్మాయితో పవన్ కొత్తగా సహజీవనం చేస్తున్నాడన్నది కూడా నిజమే అనే కొందరు తేల్చేశారు. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా పవన్, మెహర్ రమేష్ తో ఓ మూవీ చేయడానికి రెడీగా ఉన్నాడని టాక్ రావడంతో పవన్ ఫాలోయింగ్లో ఏదో తెలియని నిరాశ వ్యక్తం అవుతుంది. 

ఆ నిరాశ అంతా పవన్ పై ఎన్ని జరుగుతున్నా ఒక్కసారైనా మీడియా ముందుకు వచ్చి అసలు విషయం చెప్పడే అనే. చూస్తుంటే ఏది నిజమో, ఏది అబద్దమో తెలియడం లేదు. ఒక్కోసారి అంతా నిజమే అనిపిస్తుంది. ఇంకోసారి గాసిప్ కదా కొట్టేయలనిపిస్తుంది. ఇంతోటి దానికి పవన్ వివరణ ఇవ్వాలా అనిపిస్తుంది. ఇస్తే బాగుండు అని కూడా అనిపిస్తుంది అంటూ సదరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎటూ తేల్చుకోలేక, ఏం చేయాలో తెలియక పవన్ పై వచ్చిన కామెంట్స్ ని ఖండించాలని ప్రయత్నిస్తున్నాడు. మరి పవన్ తన ఫాన్స్ కోసమైనా ఓసారి ఇటువంటి వాటిని ఖండిస్తే మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: