ఓ అగ్ర  క‌థానాయ‌కుడి హీరోయిన్ల కొర‌త‌?  విన‌డానికి ఈ మాట విచిత్రంగా ఉన్నా. ఇదే నిజం. నంద‌మూరి బాల‌కృష్ణ -  తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఓ టాప్ హీరో. ఆయ‌న చిటికెస్తే క‌థానాయిక‌లంతా వ‌రుస క‌ట్టేవారు. మా పాత్ర ఏమిటి?  పారితోషికం ఎంత‌? అనే విష‌యాలు ప‌ట్టించుకోకుండా సై... అనేవారు. కానీ అదంతా నిన్న‌టి మాట‌. ఇప్పుడు బాల‌య్య సినిమా అంటే నై.. నై చెబుతున్నారు నాయిక‌లు. రూల‌ర్ విష‌య‌మే తీసుకోండి. ఈ సినిమా గురించి నాలుగు నెల‌ల నుంచీ క‌థానాయిక కోసం అన్వేష‌ణ సాగుతోంది. న‌య‌న‌తార, అసిన్‌, విద్యాబాల‌న్‌, నిత్య‌మీన‌న్‌... ఇలా ఎన్నో పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. వాళ్లంద‌రూ నో చెప్పారు. ఇప్పుడు  మిస్ ఇండియా ఎరీనా ఫెర్నాండేజ్ కూడా స‌సేమీరా అంది. 

స‌డ‌న్‌గా ఈ కొర‌త ఏమిటో చిత్ర‌సీమ‌కూ మ‌రీ ముఖ్యంగా బాల‌కృష్ణ సినిమా నిర్మాత‌లకూ అర్థం కావ‌డం లేదు. ఒక్క బాల‌కృష్ణ‌కే కాదు. ప‌రిశ్ర‌మ‌లో చాలామంది క‌థానాయ‌కుల‌కు హీరోయిన్ల కొర‌త ఉంది. ముఖ్యంగా ఏజ్ బార్ క‌థానాయ‌కుల‌కు. యాభై లో ప‌డినా ఇంకా ఇర‌వై ఏళ్ల అమ్మాయిల‌తో జ‌త క‌ట్టాల‌నుకొంటారు. దానికి నాయిక‌లు సిద్ధంగా లేరు. వ‌య‌సైపోతున్న‌వారితో డ్యూయెట్లు ఎలా పాడ‌తాం?  అని ప్ర‌శ్నిస్తున్నారు.
ఇప్పుడు బాల‌య్య ప‌రిస్థితే ఇంతే. బాల‌య్య వ‌య‌సైపోతోంది. ఆయన ప‌క్క‌న స‌మంత‌, త‌మ‌న్నా, కాజ‌ల్‌... వీళ్లెవ్వ‌రూ స‌రిపోరు. చిన్న‌పిల్ల‌ల్లా క‌నిపిస్తారు. అనుష్క‌, న‌య‌న‌తార‌... వీళ్లంతా ఎప్పుడో చేసేశారు. అందుకే... బాల‌య్య‌కు హీరోయిన్ల కొర‌త వ‌చ్చింది. అదెప్పుడు తీరుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: