మెగా స్టార్ తనయుడిగా టాలీవుడ్ లో మెగా ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మెగాస్టార్ సృష్టించిన సామ్రాజ్యమే లేకపోతే రామ్ చరణ్ లాంటి పర్సనాలిటి ఉన్న వ్యక్తులకు ఎవరు హీరో ఛాన్స్ లు ఇవ్వరు. కానీ టాలీవుడ్ ఎంట్రీ తరువాత తన టేలెంట్ తో తను ఏమిటో నిరూపించుకుని, రాకెట్ లా దూసుకు వెళ్ళిపోతున్నాడు చెర్రీ. కెరియర్ లో రెండవ సినిమాగానే ‘మగధీర’ లాంటి సూపర్ హిట్ దొరకడం రామ్ చరణ్ అదృష్టం. అంతేకాదు ఉపాసన లాంటి బంగారు బాతు అతడి భార్యగా లభించడం మరొక అదృష్టం. తండ్రి నట వారసత్వంతో పాటు రాజకీయ పరిచయాలు కూడా తోడవ్వడంతో మరంత అదృష్టం కలిసి వచ్చి రామ్ చరణ్ బాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్ళి పోయాయి. సినిమా బిజినెస్ విషయంలో ప్రిన్స్ మహేష్ తోటే పోటీ ఇచ్చే స్థాయి కి చెర్రీ చేరుకున్నాడు.

కానీ ఇదేవిషయంలో జూనియర్ తీసుకుంటే ఎన్టీఆర్ రామ్ చరణ్ కన్నా బాగా సీనియర్ అలాగే నటన విషయంలో కూడా చెర్రీ కన్నా జూనియర్ చాలా బాగా చేస్తాడన్న పేరుంది. కానీ సినిమాలో కొద్దిగా తేడా వస్తే చాలు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రెండో వారమే కలెక్షన్స్ పరంగా బిపి డౌన్ అయినట్లు ఐపోతాయి. ఈ విషయం ఈ మధ్యనే రిలీజ్ అయిన ‘బాదుషా’ సినిమా విషయంలో స్పష్టంగా కనిపించింది. అదే చెర్రీ సినిమాలకైతే సినిమాకు కొద్దిగా డివైడ్ టాక్ వచ్చినా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలలో మేగాభిమనులు రామ్ చాణ్ సినిమాలకు కలెక్షన్స్ కురిపిస్తూనే ఉంటారు. ఇక రాజకీయంగా కూడా జూనియర్ కు చెర్రీకి ఉన్నన్ని ప్లస్ పాయింట్స్ లేవు.తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ జునియర్ని కరివేపాకులాగే వాడుకుంటోoది అనే వార్తలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో చేర్రీకి ఉన్న చాలా ప్లస్ లు జూనియర్ కు లేవనే వాదన ఫిలింనగర్ లో వినిపిస్తోంది... .

 

మరింత సమాచారం తెలుసుకోండి: