సిద్దార్థ్ కి ఈమ‌ధ్య కాలం క‌ల‌సి రావ‌డం లేదు. న‌మ్ముకొన్న సినిమాల్ని బోల్తా కొడుతున్నాయి. దాంతో సిద్దార్థ్ మార్కెట్, ఇమేజ్ రెండూ... తిరోగ‌మ‌న ద‌శలో న‌డుస్తున్నాయి. ఎలాగైనా స‌రే - ఈసారి హిట్ కొట్టాల్సిందే - అని చేసిన సినిమా స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్. ఈ శుక్ర‌వారం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమా బాగానే ఉంది... అనేటాక్ వ‌చ్చినా తొలిరోజు వ‌సూళ్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి.

ఈ సినిమాకి క‌నీస ఓపెనింగ్స్ కూడా రాలేదు.
సిద్దార్థ్ సినిమాలొస్తే మ‌ల్టీప్లెక్స్‌లో కొన్ని టికెట్లు తెగుతాయి. ఈ సినిమాకి ఆ భాగ్యం కూడా ద‌క్క‌లేదు. శుక్ర‌వారం తెలంగాణ వాదులు చ‌లో అసెంబ్లీ అంటూ పిలుపు ఇవ్వ‌డంతో.... హైద‌రాబాద్ అంతా పొలీసు ప‌హారాలో ఉంది. హైద‌రాబాద్‌లో మ‌ల్టీప్లెక్సులు శుక్ర‌వారం న‌డ‌వ‌లేదు. దాంతో...

స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్‌కి చుక్కెదురు అయ్యింది. 
సినిమా బాగానే ఉంది అనే రిపోర్ట్ వ‌చ్చినా.. ఆ పేరు కాస్త బ్ర‌హ్మానందం ఖాతాలోకి వెళ్లిపోయింది. ఈ సినిమాలో సిద్దూ చేసిందేం లేద‌నే టాక్ వినిపిస్తోంది. గ్ర‌హాల‌న్నీ అనుకూలించి ఈ సినిమా హిట్ అయినా... పాపం... సిద్దూకి ఒరిగిందేమీ లేన‌ట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: