మహాకవి గురజాడ అప్పారావు గారు రాసిన కళాఖండం 'కన్యాశుల్కం'. ఇది నాటక రూపంలో ఇప్పటికే పలు చోట్ల మహానుభావులైన కళాకారులతో ప్రదర్శింపబడింది. తాజాగా ఈ నాటకాన్ని ప్రదర్శించేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీకికి చెందిన కొందరు నటులు రెడీ అయ్యారు. 
 

ఝాన్సీ, ఉత్తేజ్, రాళ్ళపల్లి మొదలగు వారంతా ఈ నాటకంలో పాత్రధారులే. అయితే ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నందుకు వీళ్ళను అభినందించాలాలేక ఈ మహోన్నతమైన నాటికను సినిమా, సీరియల్స్ వాటిలాగా పోల్చినందుకు కోపగించుకోవాలా అని సినిమా పరిశ్రమకు చెందిన కొందరు సినీ పెద్దలు వాపోతున్నారు. 
 

జూన్ 16న ఈ నాటకాన్ని ప్రదర్శించబోతున్నామని తెలియజేయడానికి ఈ మధ్యే ఓ రిహార్సల్ ప్రోగ్రాంని ఏర్పాటు చేసిన టీం మొత్తం మీడియాతో కూడా కాసేపు ముచ్చటించారు. ఈ ముచ్చటలో ఈ నాటకం సినిమాకి, సీరియల్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందని వారు చెప్పిన మాటలతో ఈ నాటకాన్ని అవమానించారని కొందరు కళాభిమానులు వ్యక్తం చేస్తున్నారు.  దీక్షిత్ దర్శకత్వంలో కన్యాశుల్కాన్ని రవీంద్ర భారతిలో ఆవిష్కరింపచేసి నాటక ప్రక్రియకి పాత రోజులు తేవాలీ అనుకోవడం గొప్ప ఆలోచనే కానీ ఇలా తప్పుడు మాటలు దొర్లడం మంచిది కాదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: