హీరో ఆకాష్ పేరు గుర్తొచ్చేది ఒక్క 'ఆనందం' సినిమా విషయంలోనే. కానీ ఇప్పుడు ఆకాష్ పేరు అమ్మాయిల విషయంలో కూడా బాగా వినిపిస్తుంది. చేసే సినిమాలు ఒక్కటి కూడా విడుదల అయినట్లుగా తెలియడం లేదు కానీ ఆకాష్ మాత్రం సినిమాల మీద సినిమాలు ఓపెనింగ్లు చేసుకుంటున్నాడు. 
 

మరి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా ఆకాష్ కి అవకాశాలు ఎలా వస్తున్నాయ్ అనే అనుమానం ఒకరికి కాకపోతే ఒకరికైనా వస్తుంది. ఆకాష్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలు అరడజనుకి పైగా ఉన్నాయంటే ఏ రేంజులో అమ్మాయిలను పటాయిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఆకాష్ నిర్మాత మరియు దర్శకుడుగా వ్యవహరిస్తున్న చిత్రాలు 4కి పైనే ఉన్నాయి. మిగతా చిత్రాలకు ఆకాష్ ఫ్రెండ్స్ దర్శక నిర్మాతలు. 
 

అయితే అసలు విషయం ఏమిటంటే ఆకాష్ సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ కాకుండా అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ తోనే సినిమాలు చేస్తున్నాడని, కొత్త హీరోయిన్లకు అవకాశాలు ఇస్తానని తన అవసరం తీర్చుకుంటున్నాడని ఆకాష్ తీరు చూసి అందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఇదే కాన్సెప్ట్ మీద ఆకాష్  'దొంగ ప్రేమ' అనే మూవీ కూడా చేస్తున్నాడంటే ఎంతలా అమ్మాయిల కోసం ఆకాష్ తన నిజ జీవితం నుండి ఈ సినిమా కథకు ప్రేరణ పొందాడో అర్థం చేసుకోవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: