ఒక హీరోయిన్ ఇండస్ట్రీ లో సక్సస్ అయిన తరువాత తన చెల్లెలను హీరోయిన్ గా తీసుకురావడం సర్వ సాధారణమైన విషయం. కానీ అలా వచ్చిన చెల్లెళ్ళు టాప్ హీరోయిన్స్ అయిన సందర్భాలు చాలా తక్కువ. గతంలో ప్రముఖ హీరోయిన్ నగ్మా చెల్లెలు జ్యోతిక మాత్రమే తన అక్క స్థాయిని మించి ఎదిగింది. రాధిక, జయసుధ, భానుప్రియ చెల్లెళ్ళు సినిమాలలో నటించినా పెద్దగా పాప్ లర్ కాలేదు.

కానీ టాలీవుడ్ లక్కీ హీరోయిన్ గా పేరుగాంచిన కాజల్  అగర్వాల్  చెల్లెలు నిషా అగర్వాల్ పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వరుణ్ సందేశ్ తో ‘ఏమైందో ఈ వేళ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్ర్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ తరువాత నారా రోహిత్ తో సోలో లో కనిపించింది. ఈ మధ్యనే విడుదలైన హీరో ఆది ‘సుకుమారుడు’ పరాజయం చెందినా నిషా క్యూట్ లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయి.

 నిన్న మళ్ళీ వరుణ్ సందేష్ తో నటించి విడుదలైన ‘సరదాగా అమ్మాయి తో’ సినిమాలో నిషా నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది అంటున్నారు. ఇవే కాకుండా మరో కొన్ని సినిమాలు నిషా కథలో ఉండటం తో ప్రస్తుతం కాజల్ టాలీవుడ్ కు దూరమైనా ఆ లోటును నిషా తీరుస్తోంది అంటున్నారు .ముందు ముందు అక్కని డామ్ నేట్ చేస్తుందేమో చూడాలి.....    

మరింత సమాచారం తెలుసుకోండి: