తెలుగు తెరపై త్రీడీ సందడి మొదలవ్వబోతోంది.  ఒకరు యాక్షన్ తో, మరొకరు వినోదంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.  ఇద్దరు కథానాయకులు త్రీడీ యుద్ధంలో హోరాహోరీగా తలపడబోతున్నారు. మరి విజయం ఎవరికీ దక్కుతుందో చూడాలి.  తెలుగు ప్రేక్షకులకు త్రీడీ సినిమాతో  అనుబంధం తక్కువ. ఆ మాటకొస్తే మన దగ్గర త్రీడీ ఫెసిలిటీ ఉన్న థియేటర్ లు కూడా తక్కువే.  కానీ ప్రేక్షకులకు ఎలాగైనా కొత్తదనం అందించాలన్న తపనతో త్రీడీ సినిమాలు చేశారు.  కళ్యాణ్  రామ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం  "ఓమ్". కృతి కర్బందా, నిఖిశా పటేల్ కథానాయికలు.

 సునీల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ ని కేటాయించి ఈ సినిమాని తెరకెక్కించారు. ఆయన మార్కెట్ స్టామినాకి  మూడొంతులు అధికంగా ఈ సినిమాకోసం ఖర్చుపెట్టాడు.  పూర్తిస్థాయి  యాక్షన్ నేపథ్యంతో కూడిన సినిమా ఇది. త్రీడీ యాక్షన్ ఎఫ్ఫెక్టులు ఎలా ఉంటాయో త్వరలోనే తేలిపోతుంది. అల్లరినరేష్కథానాయకుడిగా తెరకెక్కిన త్రీడీ చిత్రం "యాక్షన్". అనిల్ సుంకర ఈ సినిమాని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. వినోద ప్రధానంగా సాగే కథ ఇది. కామెడీ సినిమాని త్రీడీలో తీయడం మనదేశంలో ఇదే మొదటిసారి.

ఈ సినిమాకి కూడా నరేష్ స్థాయిని మించి ఖర్చు పెట్టారు. త్రీడీ సినిమాల  కోసం మనవాళ్ళు చాలానే కష్టపడ్డారు. మొత్తంగా 50 కోట్లు ఖర్చు పెట్టి ఈ సినిమాల్ని తెరకెక్కించారు. మనదగ్గర సాంకేతికత తక్కువగా ఉన్నా విదేశీయుల సహకారం తీసుకున్నారు. ఒకరు యాక్షన్తో మరొకరు కామెడీతో బరిలోకి దిగుతున్న ఈ ఇద్దరు హీరోల్లో ఎవరికీ విజయం దక్కుతుందో చూడాలి. అన్నట్టు ఈ రెండు సినిమాలు ఒకదానికొకటి వారం వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: