తెరపై కనిపించే ప్రతి పాత్రకూ ఓ అర్థం,  పరమార్థం ఉండాలని చెబుతుంటారు. ఏదో అలా  కెమెరా ముందుకు వచ్చి ఇలా  వెళ్లిపోతామంటే ఒరిగేదేమీ ఉండదు.  ప్రచారం కోసం పాకులాడారు అనే అపప్రద తప్ప.  సిద్ధార్థ్ సినిమా "సంథింగ్ సంథింగ్" విషయంలో అదే జరిగింది. అతిథి పాత్రల్లో రానా, సమంతా అంటూ చిత్ర బృందం దండోరా వేసింది. తీరా ఆ ఇద్దరు అతిథులను తెరపై చూశాక ఆ తరహా పాత్రలపై ఏర్పడే ఆసక్తే  సన్నగిల్లుతుంది. ఇద్దరూ మెరుపు తీగలాగా తెరపైకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. 

సమంతాకి అయితే డైలాగ్ కూడా లేదు. రానా ఓ మాట మాట్లాడతాడు కానీ అది సినిమాకి ఏ మాత్రం ఉపయోగపడదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎవ్వరికీ ఉపయోగం లేని అథితులు వీరు. సాధారణంగా అతిథి పాత్రలు అనగానే కథను మలుపు తిప్పేలా ఉంటాయేమో అని ఊహిస్తాం. ఉదాహరణకు " ఖుషి" సినిమానే తీసుకోండి. అందులో యస్.జె .సూర్య కథ ఆరంభంలో, చివరలో కనిపిస్తాడు.

తెరపై రెండు క్షణాలే కనిపించినా కథను మలుపుతిప్పే పాత్ర అది. ఆ తరహాలో తెరపై సందడి చేయాల్సిన పాత్రలు ఇప్పుడు  ఉసూరుమనిపిస్తున్నాయి.  సిద్ధార్థ్ తో ఉన్న అనుబంధం మూలానే "సంథింగ్ సంథింగ్" సినిమాలో రానా, సమంతాలు అతితులుగా సందడి చేశారు. అంతకు మించి ఈ పాత్రలతో కథకు ఏ మాత్రం అవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: